Beauty Tips: సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ముందుగా దేన్ని అప్లై చేయాలి?

Beauty Tips: వేసవి కాలంలో స్కిన్ కేర్ కోసం కచ్చితంగా సన్‌స్క్రీన్ అవసరం అంటున్నారు నిపుణులు. చాలా మంది సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్‌ను ఎలా? ఏ క్రమంలో కలిపి అప్లై చేయాలి అనే విషయం మీద ఓ క్లారిటీకి రాలేకపోతుంటారు? మీరు ముందుగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలా? లేదా సన్‌స్క్రీన్ అప్లై చేయాలా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివేద్దాం. ఆ తర్వాత మీ స్కిన్ కేర్ మెరుగు అవుతుంది.
చర్మ సంరక్షణ కోసం మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ రెండింటినీ ఉపయోగించాల్సిందే. ఈ రెండు కూడా చర్మానికి చాలా ముఖ్యం. కానీ వాటి ప్రభావాలను సరిగ్గా చూడటానికి సరైన పద్ధతి, సమయాన్ని తెలుసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ రెండింటినీ సరిగ్గా ఉపయోగిస్తే, అది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, సూర్యుని హానికరమైన కిరణాల నుంచి కూడా రక్షిస్తుంది.
1. చర్మ రకాన్ని బట్టి –
మీ చర్మం పొడిగా ఉంటే, ముందుగా మాయిశ్చరైజర్ రాయాలి. మాయిశ్చరైజర్ మీ చర్మంలోకి సరిగ్గా చొచ్చుకుపోయేలా 5-7 నిమిషాలు అప్లై చేయండి. తరువాత సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. ఈ విధంగా మీ చర్మం తేమగా ఉంటుంది. సన్‌స్క్రీన్ వల్ల తెల్లటి మచ్చలు కనిపించవు.
2. మీరు ఎక్కువగా చెమట పడుతుంటే-
మీ చర్మం చెమట పట్టే అవకాశం ఎక్కువగా ఉంటే, మీరు డైరెక్ట్ గా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. చెమట సన్‌స్క్రీన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు దానిని ఎప్పటికప్పుడు మళ్లీ అప్లై చేసుకోవచ్చు. ఈ పద్ధతి మీ చర్మాన్ని సూర్య కిరణాల నుంచి కాపాడటంలో సహాయం చేస్తుంది.
3. ఈత కొడుతున్నప్పుడు –
మీరు ఈత కొడుతున్నట్లయితే, నీటిలోకి దిగే ముందు సన్‌స్క్రీన్ మాత్రమే రాసుకోండి. నీటిలోకి వెళ్తే మీ చర్మానికి మళ్ళీ మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ రెండూ అవసరమవుతాయి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తేమగా ఉండటంతో పాటు ఎండ నుంచి రక్షణ కూడా లభిస్తుంది.
మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్‌ను సరైన క్రమంలో ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. రక్షించుకోవచ్చు కూడా. కాబట్టి సూర్య కిరణాలు మీ స్కిన్ మీద పడితే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ లను సరైన పద్దతిలో ఉపయోగించాలి. మీ స్కిన్ కేర్ బాధ్యత మీదే..
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Beauty Tips : అకాల వృద్దాప్యంతో బాధ పడుతున్నారా? మొహం మీద ముడతలు వచ్చేశాయా? జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి..
-
Beauty Tips: ఇంతకీ రోజుకు ఎన్ని సార్లు మొహం క్లీన్ చేసుకోవాలి? ఎవరు ఎలాంటి ఫేస్ వాష్ ఎంచుకోవాలి?
-
Beauty Parlours: పార్లర్ కు వెళ్తున్నారా? ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా?