Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • What Happens If You Drink Coconut Water Three Times A Week

Coconut Water: వారానికి మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందంటే?

Coconut Water ఫుల్ బిజీ కాబట్టి నీరు కూడా తాగరు చాలా మంది. లైట్ తీసుకుంటారు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కానీ కొబ్బరి నీళ్లు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శక్తిని కూడా ఇస్తాయి.

Coconut Water: వారానికి మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందంటే?
  • Edited By: swathi chilukuri,
  • Updated on April 1, 2025 / 10:43 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Coconut Water: వేసవి వేడిలో కొబ్బరి నీళ్లు తాగడం అంటే నెక్స్ట్ లెవల్ ఫీల్ కదా. అది దాహాన్ని తీర్చడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఒక వరం లాంటిది. అందుకే మరింత సూపర్ ఫీల్ అనిపిస్తుంది. పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో కొబ్బరి నీటిని ఔషధంగా పరిగణిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడటమే కాకుండా, జీర్ణక్రియ, చర్మం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వారానికి 3 రోజులు మాత్రమే కొబ్బరి నీళ్లు తాగిన సరే ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా చేస్తే కొన్ని వారాల్లోనే మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఇంతకీ ఎలాంటి ప్రయోజనాలు అంటే?

శరీరం హైడ్రేటెడ్ : ఫుల్ బిజీ కాబట్టి నీరు కూడా తాగరు చాలా మంది. లైట్ తీసుకుంటారు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కానీ కొబ్బరి నీళ్లు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శక్తిని కూడా ఇస్తాయి. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, మెగ్నీషియం శరీరాన్ని తక్షణమే తాజాగా ఉంచుతాయి. ముఖ్యంగా వేసవిలో, శరీరం నుంచి అవసరమైన ఖనిజాలు చెమట రూపంలో తొలగించినప్పుడు, కొబ్బరి నీరు ఈ లోపాన్ని భర్తీ చేయడానికి ఒక అద్భుతమైన మార్గంగా మీకు సహాయం చేస్తుంది.

దీన్ని ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?
మీరు ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగలేకపోతే, వారానికి కనీసం మూడు రోజులైనా తాగండి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. మీరు తరచుగా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ లేదా అసిడిటీ వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే , కొబ్బరి నీళ్లు చాలా బెటర్. ఎందుకంటే వీటిలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే సహజ ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి. అంతేకాదు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడం ద్వారా ప్రేగులను శుభ్రపరుస్తుంది.

కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. జీర్ణక్రియను సక్రియం చేస్తుంది. అందుకే కడుపులో ఉబ్బరం లేదా బరువుగా అనిపించడం వంటి సమస్యలతో బాధ పడేవారికి మంచి రెమెడీ. ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించకుండా మీ చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ దినచర్యలో కొబ్బరి నీళ్లను చేర్చుకుంటే చాలు అంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మీ చర్మం నుంచి డిటాక్స్ ను తొలగిస్తాయి.

ఇది ఎలా పని చేస్తుంది?
ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది నీరసాన్ని తొలగిస్తుంది. ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలను తేలికపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇచ్చి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
మీరు వారానికి మూడు రోజులు కొబ్బరి నీళ్లు తాగాలి. ఇలా కొన్ని వారాల పాటు తాగితే, మీ చర్మంలో తేడాను మీరే గమనిస్తారు. అంతేకాదు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మూత్రపిండాలు, మూత్ర నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా సంరక్షించే సహజ పానీయం. మీరు దీన్ని వారానికి 3 రోజులు మాత్రమే మీ దినచర్యలో చేర్చుకుంటే, కేవలం 2 నుంచి 4 వారాలలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.

Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.

Tag

  • Coconut water
  • coconut water benefits
  • coconut water health benefits
Related News
  • Coconut Water: కొబ్బరి నీరు తాగే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • Coconut water : వీరు కొబ్బరి నీరు అసలు తాగవద్దు. తాగితే అంతే సంగతులు..

  • Coconut water: ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు అధికంగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త

Latest Photo Gallery
  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

  • Mouni Roy : ఫ్యాషన్ దుస్తులతో అదరగొడుతున్న అందాల భామ మౌని రాయ్..

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us