Vanajeevi Ramaiah: వనజీవి రామయ్య ఇకలేరు.. ఇంతకీ ఎవరీతను?
పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య పర్యావరణ ప్రేమికుడిగా ప్రసిద్ధ చెందారు.

Vanajeevi Ramaiah: పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య పర్యావరణ ప్రేమికుడిగా ప్రసిద్ధ చెందారు. అయితే గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రామయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మృతి చెందారు. ఇతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో కోటి మొక్కలు నాటి వన ప్రేమికుడిగా రామయ్య పేరు సంపాదించుకున్నారు. రామయ్య చేసిన సేవలకు 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద చూసుకుంటే.. ఎవరూ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని పొందలేదు. పొందిన తొలి వ్యక్తి కూడా వన జీవి రామయ్యనే. రెండేళ్ల క్రితం వనజీవి రామయ్యకు రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని రోజులకు కోలుకున్నారు. ఆ తర్వాత కూడా మొక్కలు నాటడం అయితే ఆపలేదు. మొక్కలు నాటుతూనే ఉన్నారు. ఈ దంపతులకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ ఎంతో కృషి చేశారు. చిన్నతనం నుంచే వనజీవి రామయ్యకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఎన్నో ప్రాంతాల్లో మొక్కలు నాటారు.
Also Read: ఇంటర్ తర్వాత ఈ పరీక్షలు రాస్తే.. కెరీర్‌లో టాప్ మీరే
రామయ్య తన ఇంట్లో ఏకంగా ఎర్రచందనం మొక్కలు పెంచారు. వీటిని ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే రామయ్యకు ఖమ్మం డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ చికిత్స చేశారు. ఈ సమయంలో అతనితో ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. వైద్యుడిగా అతడికి సేవలు అందించే అవకాశం తనకు చాలాసార్లు దక్కిందని తెలిపారు. రామయ్య అనారోగ్య సమయంలో కూడా మొక్కల గురించి తలచుకునేవారని తెలిపారు. మొక్కలు నాటాలని వాటితోనే తమకు జీవితం ఉందని అనేవారు. చిన్నతనం నుంచే మొక్కలపై ఉండే ప్రేమతో.. చెట్లను పెంచండి అనే నినాదాన్ని తీసుకొచ్చారు. పర్యావరణానికి మంచిగా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి.
Also Read: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో.. ఎన్‌ఎల్‌సీ ఇండియాలో ఉద్యోగాలు
వనజీవి రామయ్య మృతిపై ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం తెలియజేశారు. రామయ్య చేసిన కృషి అందరికీ ఎంతో స్ఫూర్తి దాయకమని తెలిపారు. పర్యావరణ విషయంలో ఎంతో కృషి చేశారని తెలిపారు. నేటి యువతకి రామయ్య ఎంతో ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే నారా లోకేష్ కూడా సంతాపం తెలియజేశారు. వనజీవి రామయ్య లేకపోవడం చాలా బాధాకరం. ఈ వార్త తెలిసిన వెంటనే ఆందోళనకు గురయ్యానని తెలిపారు. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య నేటి తరానికి స్ఫూర్తి. ప్రతీ ఒక్కరూ కూడా పర్యావరణ విషయంలో ఇతని దగ్గర నేర్చుకోవాలి.