Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
బరువు తగ్గి ఫిట్‌గా ఉండాలని చాలా మంది భావిస్తారు. దీనికోసం ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ముఖ్యంగా వెయిట్ తగ్గాలని మందులు వాడటం, జిమ్ చేయడం ఇలా ఎన్నో చేస్తుంటారు. నిజానికి బరువు పెరగడానికి ముఖ్య కారణం.. ఈ రోజుల్లో పోషకాలు లేని ఫుడ్స్ తినడం వల్ల వస్తుంది.

Weight lose: బరువు తగ్గి ఫిట్‌గా ఉండాలని చాలా మంది భావిస్తారు. దీనికోసం ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ముఖ్యంగా వెయిట్ తగ్గాలని మందులు వాడటం, జిమ్ చేయడం ఇలా ఎన్నో చేస్తుంటారు. నిజానికి బరువు పెరగడానికి ముఖ్య కారణం.. ఈ రోజుల్లో పోషకాలు లేని ఫుడ్స్ తినడం వల్ల వస్తుంది. ప్రస్తుతం రోజుల్లో ఇంట్లో వండుకుని తినకుండా బయట ఫుడ్ తింటున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ వంటివి తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చీజ్, మసాలా వంటి వాటివల్ల ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారు. దీంతో బరువు తగ్గాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కొందరు అయితే వీటి కోసం ప్రొటీన్ పౌడర్లు తాగడం, మందులు వాడటం వంటివి కూడా చేస్తున్నారు. అయితే ఈజీగా బరువు తగ్గాలంటే ఇలాంటివి కాకుండా చిన్న చిట్కాలు పాటించండి. రాత్రిపూట అన్నం తినకుండా పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. మరి ఈ పండ్లు ఏవో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: ప్రెషర్ కుక్కర్‌లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
పైనాపిల్
వేసవిలో ఎక్కువగా పైనాపిల్ పండ్లు లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచుతుంది. దీనివల్ల మీకు ఆకలి వేయదు. మీరు మళ్లీ ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకోరు. వీటివల్ల మీరు ఈజీగా బరువు తగ్గుతారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.
పుచ్చకాయ
ఈ పండు వేసవిలో ఎక్కువగా లభిస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడటంతో పాటు ఈజీగా బరువు తగ్గేలా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అన్ని కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. వేసవిలో చర్మంగా ట్యాన్‌గా మారుతుంది. అదే పుచ్చకాయ తింటే ఇక అలాంటి సమస్య ఉండదు. ఫేస్ చాలా క్లియర్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also; 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
నారింజ
ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్నింటిని కూడా తొలగిస్తుంది. డైలీ ఒక నారింజ పండును తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ఖర్భూజా
ఈ పండు వేసవిలోనే ఎక్కువగా లభ్యమవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే బాడీని హైడ్రేట్‌గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డైలీ ఈ పండును తింటే బాడీకి చలవ చేస్తుంది. అలాగే ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు అన్ని కూడా తగ్గుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని నిపుణులు చెబుతున్నారు.
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..
-
Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?
-
Paneer : పనీర్ అంటే ఇష్టమా? కానీ మీరు తినవద్దు..