Collagen Production Foods: కొల్లాజెన్ ఉత్పత్తి పెరగాలంటే జస్ట్ ఈ సూప్ లను తాగండి చాలు..

Collagen Production Foods: వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందికి ముడతలు కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం కొల్లాజెన్ లేకపోవడం అంటున్నారు నిపుణులు. చర్మం, ఎముకలు, కీళ్ళు, కండరాలకు చాలా ముఖ్యమైనది కొల్లాజెన్. ఇది శరీరాన్ని కూల్ గా సరళంగా ఉంచడంలో తోడ్పడుతుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్ది ఈ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే స్కిన్ నీరసంగా, నిర్జీవంగా మారుతుంటుంది. ఇక మీ స్కిన్ ను అందాన్ని కాపాడుకోవాలంటే ఈ కొల్లాజెన్ మాత్రం చాలా ముఖ్యం. అయితే మార్కెట్లో అనేక రకాల కొల్లాజెన్ సప్లిమెంట్లు లభిస్తున్నాయి. అయితే వాటిని స్కిప్ చేసి ఫుడ్ ద్వారా మాత్రమే కొల్లాజెన్ ను తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని సూప్ లు తీసుకుంటే కొల్లాజెన్ ను ఉత్పత్తి అవుతుంది. మరి ఆ సూప్ లు ఏంటంటే?
1. బోన్ బ్రత్ సూప్: ఎముక రసంలో కొల్లాజెన్ ఉంటుంది. ఎముకలను మరిగించి దీన్ని తయారు చేస్తారు. కొల్లాజెన్, గ్లూకోసమైన్, జెలటిన్, అమైనో ఆమ్లాలు కూడా శరీరంలోకి వెళ్తాయి. అంతేకాదు చర్మం బిగుతుగా అవుతుంది. ప్రకాశవంతంగా మారుతుంది. ఎముకలు, కీళ్లు కూడా చాలా బలంగా ఉంటాయి.
తయారీ విధానం: చికెన్ లేదా మటన్ ఎముకలను మంట మీద 8 నుంచి 10 గంటల వరకు ఉడికించాలి. ఇందులో అల్లం, నల్ల మిరియాలు, వెల్లుల్లి కాస్త నిమ్మరసం వేయాలి. ఆ తర్వాత సూప్ ను వడకట్టి తాగితే సరిపోతుంది. ఈ సూప్ ను తాగడం వల్ల మీ స్కిన్ చాలా మెరుగు అవుతుంది. ఎముకలు, కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. జీర్ణక్రియ మెరుగు అవుతుంది అంటున్నారు నిపుణులు.
2. టమోటా – క్యారెట్ సూప్: టమోటాలు, క్యారెట్ల లు విటమిన్ సిని కలిగి ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటి వల్ల కొల్లాజెన్ త్వరగా ఏర్పడుతుంది. వీటి మిశ్రమ సూప్ ను తీసుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి.
తయారీ విధానం: 2 టమాటాలు, ఒక క్యారెట్ ను తీసుకొని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఇందులోనే నల్ల మిరియాలు, నిమ్మరసం, ఉప్పు వేసి సూప్ తయారు చేయాలి. ఇక ప్రయోజనాల విషయానికి వస్తే చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది ఈ సూప్. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మీ స్కిన్ ను మెరుగుపరుస్తుంది.
3. పుట్టగొడుగుల సూప్: పుట్టగొడుగులలో రాగి, సెలీనియం లభిస్తుంది. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని చేస్తాయి. అందుకే మీరు పుట్టగొడుగుల సూప్ తాగాలి.
తయారీ విధానం: ఒక కప్పు పుట్టగొడుగులను తీసుకొని ముక్కలుగా కోసి నీటిలో మరిగించి తర్వాత మిక్సీలో వేయాలి. దీనికి కాస్త వెల్లుల్లి, నల్ల మిరియాలు, నిమ్మకాయ రసం యాడ్ చేసి తాగాలి. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ళు, కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..
-
IPL: ఐపీఎల్ సీజన్లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!
-
Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?
-
Paneer : పనీర్ అంటే ఇష్టమా? కానీ మీరు తినవద్దు..