Cooking Oil: వంటల్లో నూనెను తగ్గించేందుకు చిట్కాలివే
Cooking Oil కూరల్లో ఎక్కువగా నూనె అయితే అందులో ఐస్ వేయండి. దీనివల్ల కూరలోని నూనె అంతటిని కూడా ఐస్ ముక్క పీల్చేస్తుంది. దీనివల్ల మీకు కూరలో ఎలాంటి నూనె కూడా కనిపించదు.

Cooking Oil: ఏవైనా వంటలు చేయాలంటే తప్పకుండా నూనె అవసరం. నూనె లేకపోతే టేస్టీ వంటలు వండటం కష్టం. కొందరు వంట్లలో ఎక్కువగా నూనె వేస్తుంటారు. మరికొందరు చాలా తక్కువగా వేస్తారు. అయితే కొన్ని రకాల వంటలకు నూనె లేకపోతే అసలు టేస్ట్ కూడా ఉండవు. కొన్నిసార్లు కొందరు తెలియకుండానే ఎక్కువగా నూనె వేస్తుంటారు. వేసిన నూనెను తీయలేక ఇక కష్టమైనా కూడా తినేస్తారు. నూనె ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బాడీలో కొవ్వు పెరిగిపోతుంది. దీంతో ఊబకాయం వంటి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే వంటల్లో నూనె ఎక్కువ అయితే ఆ నూనెను బయటకు తీయలేం. కానీ ఆ నూనెను మాత్రం తగ్గించగలం. అయితే నూనెను తగ్గించడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ స్టోరీలో చూద్దాం.
ఐస్ ముక్క
కూరల్లో ఎక్కువగా నూనె అయితే అందులో ఐస్ వేయండి. దీనివల్ల కూరలోని నూనె అంతటిని కూడా ఐస్ ముక్క పీల్చేస్తుంది. దీనివల్ల మీకు కూరలో ఎలాంటి నూనె కూడా కనిపించదు. మీరు హ్యాపీగా ఆ కూరలను తినవచ్చు. మీరు ఎలాంటి కూర చేసినా కూడా కాస్త ఆయిల్ ఎక్కువ అయ్యిందనిపిస్తే వెంటనే ఐస్ ముక్క వేసేయండి.
ఉడికించడం
కూరల్లో ఎక్కువగా ఆయిల్ అయితే వాటిని మళ్లీ ఉడికించండి. దీనివల్ల ఆయిల్ తగ్గుతుంది. మళ్లీ కూరను ఉడికించడం ఇష్టం లేకపోతే కూరగాయ ముక్కలు వేసి ఉడికించండి. దీనివల్ల మీ కూరలోని ఆయిల్ తగ్గుతుంది. అయితే కొందరికి మళ్లీ మళ్లీ కూరను ఉడికించడం అసలు ఇష్టం ఉండదు. అలాంటి వారు ఐస్ ముక్కలను వేయడం బెటర్.
బ్రెడ్
కూరలో ఆయిల్ ఎక్కువ అయితే బ్రెడ్ వేస్తే ఈజీగా పీల్చేస్తుంది. కూరలో ఎంత ఆయిల్ ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతుంది. మీ దగ్గర ఏ బ్రెడ్ ఉన్నా కూడా మీరు కూరల్లో వేయవచ్చు.
పెరుగు
వంటల్లో ఆయిల్ ఎక్కువ అయ్యిందనిపిస్తే మీరు పెరుగు వేస్తే చాలు.. ఎలాంటి ఆయిల్ కూడా ఉండదు. మీరు వండిన కూర కూడా టేస్టీగా ఉంటుంది. చాలా మంది కొన్ని వంటల్లో పెరుగు వేస్తారు. ఇది వంటలు మరింత రుచిగా మారేలా చేస్తాయి.
దుంపలు
ఆయిల్ పీల్చడానికి దుంపలు బాగా ఉపయోగపడతాయి. వంటల్లో ఎక్కువగా ఆయిల్ అయితే మాత్రం వెంటనే దుంపను కట్ చేసి వేయండి. ఇవి మీ కూరలోని ఆయిల్‌ను పీల్చేస్తుంది. దుంపలు కూరల్లో వేస్తే టేస్టీగా ఉంటుంది. ఎలాంటి కూర అయినా కూడా రుచిగా మారుతుంది.
శనగపిండి
వంటల్లోని ఆయిల్‌ను తగ్గించడానికి శనగపిండి బాగా ఉపయోగపడుతుంది. ఇది కూరల్లోని ఆయిల్‌ను ఈజీగా తగ్గించడంతో పాటు వంటలు టేస్టీగా ఉండేలా చేస్తుంది. ఇవి కూరలకు టేస్టీని ఇవ్వడంతో పాటు అందులోని నూనెను కూడా తగ్గిస్తుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.