Tips:పాత బంగారు నగలు కొత్తగా మెరవాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి

Tips:
అమ్మాయిలకు బంగారు నగలు అంటే పిచ్చి. అందంగా కనిపించడానికి బంగారు నగలను ఎక్కువగా ధరిస్తుంటారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్, పెళ్లి, పండుగ ఇలా వేడుక అయినా కూడా పట్టు చీరలు కట్టి బంగారు నగలు తప్పకుండా ధరిస్తారు. అయితే వీటిని కొందరు వాడిన తర్వాత శుభ్రం చేయకుండా ఉంచుతారు. దీనివల్ల బంగారు నగలు నల్లగా అయిపోతుంటాయి. ఆటోమెటిక్‌గా వాటి మెరుపు కూడా తగ్గిపోతుంది. కొందరు వీటికి అప్పుడప్పుడు పాలిష్ కూడా చేయిస్తుంటారు. పాలిష్ చేయడం వల్ల బంగారు నగలు కొత్తగా కనిపిస్తాయని భావిస్తారు. కానీ వీటివల్ల ఆ నిమిషానికి బంగారు నగలు కొత్తగా కనిపించినా ఆ తర్వాత నల్లగా మారిపోతుంటాయి. అదే ఇంట్లోనే సహజ చిట్కాలు పాటిస్తే బంగారు నగలు ఎప్పటికీ మెరుస్తుంటాయి. అయితే బంగారు నగలు ఎప్పటికీ మెరవాలంటే ఇంట్లో పాటించాల్సిన ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
బంగారు నగలను ఇంట్లోనే ఈజీగా తలతల మెరిసేలా చేయవచ్చు. సబ్బు కలిపిన గోరువెచ్చని నీటిలో బంగారు ఆభరణాలను ఉంచాలి. ఆ తర్వాత మెత్తని బ్రష్ లేదా దూదితో నెమ్మదిగా క్లీన్ చేయాలి. ఇలా చేసిన తర్వాత శుభ్రమైన క్లాత్‌తో తుడవాలి. ఇలా చేస్తే నగలు మెరుస్తాయి. అయితే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. నెలకు ఒకసారి లేదా రెండు మూడు నెలలకు ఒకసారి చేయాలి. ఇలా చేయడం వల్ల నగలు పాడవకుండా ఉంటాయి. అయితే కొందరు గోరువెచ్చని నీటిలో కాస్త అమ్మోనియా కలుపుతారు. దీనివల్ల నగలు మెరుస్తాయి. కానీ ఎక్కువ సార్లు ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏడాదికి ఒకసారి నగలను టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల ఏవైనా మరమ్మతులు ఉంటే క్లియర్ అవుతాయి. అయితే కొన్ని బంగారాలు చాలా సున్నితంగా ఉంటాయి. దీనివల్ల తొందరగా పాడవుతాయి. అదే ఏడాదికి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
బంగారు నగలను ఎక్కువ సమయం ఎండలో ఉంచకూడదు. దీనివల్ల వాటి మెరుపు తొందరగా తగ్గిపోతాయి. అలాగే వీటిని పెర్ఫ్యూమ్, స్ప్రే, సబ్బు, క్రీమ్ వంటి వాటిలో కూడా ఉంచకూడదు. వీటివల్ల బంగారం పూత పోతుంది. అలాగే మేకప్ అంతా వేసుకున్న తర్వాతే బంగారు నగలు ధరించాలి. వీటిని ఏదో బ్యాగ్‌లో కాకుండా ఒక్కో దాన్ని సపరేట్‌గా ఉంచాలి. అప్పుడే అవి పాడవకుండా ఉంటాయి. అయితే ఎక్కువగా పనులు చేస్తే బంగారు నగలు ధరించవద్దు. వీటివల్ల తొందరగా నగలు పాడవుతాయి. వాటి మెరుపు కూడా తగ్గిపోతుంది. బంగారు నగలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఎక్కువ కాలం రావాల్సినవి తక్కువ రోజులు వస్తాయి. కాబట్టి బంగారు నగలను జాగ్రత్తగా చూసుకోండి. దీనివల్ల నగలు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Gold: ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందంటే?
-
Gold prices : కొండెక్కుతున్న పసిడి ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో గోల్డ్
-
Gold: వాడకుండా ఉంటే బంగారం పోతుందా?
-
Vastu Tips: వారంలో ఏ రోజు బంగారం కొనడానికి మంచిదో మీకు తెలుసా?
-
Vastu Tips: వారం రోజులు ఇలా చేస్తే చాలు.. మీ ఇళ్లంతా డబ్బే డబ్బు