Expensive watches: ప్రపంచంలో ఖరీదైన వాచ్‌లు ఇవే

Expensive watches:
సమయం తెలుసుకోవడానికి చాలా మంది వాచ్‌లు వాడుతుంటారు. అయితే ఎవరి స్తోమతను బట్టి వారు వాచ్‌లు కడుతుంటారు. ఒక్కో కంపెనీ బ్రాండ్ బట్టి ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో ఖరీదైన కంపెనీ వాచ్‌లు ఉన్నాయి. వీటిని ఎక్కువగా ధనవంతులు వాడుతుంటారు. అయితే ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన వాచ్‌లు ఏవేవో ఈ స్టోరీలో చూద్దాం.
గ్రాఫ్ డైమండ్స్ హాలుసినేషన్
దీన్ని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ ఇదే. దీని విలువ దాదాపుగా రూ.478 కోట్ల రూపాయలు ఉంటుంది.
గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్
దీన్ని వజ్రాలతో తయారు చేశారు. ఈ వాచ్ ధర రూ.435 కోట్లు ఉంటుంది. అయితే ఈ వజ్రాలను తీసేసి ఉంగరంగా కూడా ధరించవచ్చట.
పటేక్ ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్ చిమ్ రెఫ్ 6300A-010
ఈ వాచ్ ధర దాదాపుగా రూ.269 కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన గడియారంగా రికార్డు సృష్టించింది ఇదే.
బ్రెగ్యుట్ గ్రాండే కాంప్లికేషన్ మేరీ ఆంటోయినెట్
ఈ వాచ్‌ను దాదాపు 40 ఏళ్ల పాటు శ్రమించి తయారు చేశారు. ఈ వాచ్‌ను తయారు చేయడానికి 30 మిలియన్ల డాలర్ల ఖర్చు అయ్యింది. అంటే ఇండియన్ కరెన్సీలో వాచ్ ధర రూ.261 కోట్లు అన్నమాట.
జాగర్-లెకోల్ట్రే జోయిల్లెరీ 101 మ్యాన్చెట్
ఈ వాచ్ అనేది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన గడియారాల్లో ఇది ఒకటి. దీన్ని క్వీన్ ఎలిజబెత్ 2 కోసం తయారు చేశారు. ఈ వాచ్ 26 మిలియన్ల డాలర్లు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.226 కోట్లు అన్నమాట.
పటేక్ ఫిలిప్ హెన్రీ గ్రేవ్స్ సూపర్కాంప్లికేషన్
ఈ వాచ్ ధర దాదాపుగా 26 మిలియన్ల డాలర్లు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.226 కోట్లు ఉంటుంది. ఈ వాచ్‌ను అమెరికన్ బ్యాంకర్ హెన్రీ గ్రేవ్ కోసం బంగారు పాకెట్‌తో 1933లో తయారు చేశారు.
చోపార్డ్ 201 క్యారెట్ వాచ్
అత్యంత ఖరీదైన వాచ్‌లలో ఇది కూడా ఒకటి. ఈ చోపార్డ్ 201 క్యారెట్ వాచ్ ఖరీదు దాదాపుగా 25 మిలియన్ల డాలర్లు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.217 కోట్లు ఉంటుంది. దీన్ని తెలుపు, పసుపు బంగారంతో ఎక్కువగా తయారు చేస్తారు.
రోలెక్స్ పాల్ న్యూమన్ డెటోనా రెఫ్
ఈ వాచ్‌ను ఉక్కుతో తయారు చేశారు. ఈ వాచ్ ధర 18.7 మిలియన్ల డాలర్లు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.162 కోట్లు ఉంటుంది.
జాకబ్ & కో.బిలియనీర్ వాచ్
ఈ వాచ్ పేరుకి తగ్గట్లుగానే ఉంటంది. ఈ వాచ్ ధర దాదాపుగా రూ.156 కోట్లు ఉంటుంది. అయితే ఈ గడియారాన్ని కేవలం ధనవంతులు మాత్రమే వాడగలరు. అయితే దీంట్లో 18 క్యారెట్ల తెల్ల బంగారం ఉపయోగించారట.
పటేక్ ఫిలిప్ స్టెయిన్లెస్ స్టీల్ రెఫ్
ఈ వాచ్‌ను 1518లో తయారు చేశారు. అయితే అరుదైన గడియారాల్లో ఇది కూడా ఒకటి. ఈ కంపెనీ వాచ్ ల విలువ దాదాపుగా 12 మిలియన్ల డాలర్లు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.100 కోట్లు అన్నమాట.