Summer Health Tips: వేసవిలో వీటిని తీసుకుంటే.. బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
Summer Health Tips వేసవిలో కీరదోసకాయలు తీసుకోవడం వల్ల బాడీ కూల్‌గా ఉంటుంది. శరీరంలోని వేడి అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఎండ నుంచి శరీరం వేడి చేస్తుంది.

Summer Health Tips: వేసవిలో ఎంత ఆరోగ్యమైన ఫుడ్ తీసుకున్నా కూడా కాస్త అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బాడీ బాగా వేడికి గురవుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో కూడా చాలా మంది బాడీకి వేడిగా ఉన్న వాటినే తీసుకుంటారు. మసాలా, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే వేసవిలో బాడీకి చలవ చేసే వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన నుంచి బయటపడతారని నిపుణులు అంటున్నారు. అయితే వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి కీర దోస బాగా ఉపయోగపడుతుంది. దీన్ని డైలీ డైట్‌లో తీసుకుంటే బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి వేసవిలో కీరదోస కాయలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
బాడీ కూల్
వేసవిలో కీరదోసకాయలు తీసుకోవడం వల్ల బాడీ కూల్‌గా ఉంటుంది. శరీరంలోని వేడి అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఎండ నుంచి శరీరం వేడి చేస్తుంది. దీని నుంచి కాపాడటానికి కీర బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కీర దోసకాయలో 98 శాతం నీరు ఉంటుంది. ఇది బాడీని హైడ్రేట్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. డైలీ దీన్ని తీసుకుంటే బాడీ డీహైడ్రేషన్‌కు గురికాదు.
బరువు తగ్గడం
బరువు తగ్గాలనుకునే వారికి కీరా బాగా ఉపయోగపడుతుంది. దీంతో సలాడ్‌లా తయారు చేసుకుంటే బరువు ఈజీగా కంట్రోల్ అవుతుంది. మీరు ఫిట్‌గా ఉంటారు. ఇందులోని నీటి శాతం కడుపును నిండుగా ఉంచుతుంది. ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు.
వడదెబ్బ
వేసవిలో వేడి తీవ్రతకు చాలా మంది వడదెబ్బకు గురవుతుంటారు. అదే కీరా తీసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటారు. మీకు కావాల్సిన శక్తి అంతటిని కూడా కీరదోస కాయ ఇస్తుంది. ఇందులోని పోషకాలు బాడీని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బీపీ తగ్గుదల
కీరదోసలో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడతాయి. వేసవిలో వీటిని డైలీ తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
జీర్ణ సమస్యలు
చాలా మంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వీటిని తీసుకుంటే తగ్గిస్తాయి. ఇందులోని ఫైబర్ మలబద్ధకం, జీర్ణ సమస్యలు అన్నింటిని కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
చర్మ ఆరోగ్యం
కీర దోసలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా ఈ కీర దోస పెంచుతుంది. ఎలాంటి కళ్ల సమస్యలు రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు.
-
Summer Health Tips: వేసవిలో వీటిని తీసుకోండి శరీరం చల్లగా ఉంటుంది.
-
Summer: వేసవిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోండిలా!
-
Summer : సమ్మర్ లో ప్రయాణమా? ఇవి మస్ట్..
-
Summer Health Tips: ఎండాకాలం మొదలైంది. ఉప్పు నీరు తాగుతున్నారా?
-
Summer Health Tips: ఎండాకాలంలో వచ్చే వ్యాధులు, లక్షణాలు.. తస్మాత్ జాగ్రత్త
-
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.