Sleep: పడుకున్న వెంటనే నిద్ర పట్టాలా? ఇవి పాటించండి..

Sleep:
మారిన జీవనశైలి వల్ల నిద్ర పట్టడం కూడా కష్టమే. బెడ్ మీదకు వెళ్లిన వెంటనే అసలు నిద్రనే పట్టదు. చాలా సమయానికి నిద్ర వస్తుంది. ముందే నిద్ర రాదంటే.. చాలా మంది ఆ ఫోన్ లలో మొహం పెట్టి వచ్చే నిద్రను కూడా రాకుండా చేస్తున్నారు. సో రాత్రి 12, 1 గంటలు అయినా సరే మేల్కొని ఉంటున్నారు. బట్ ఆ తర్వాత చాలా మంది ఆలోచిస్తారు. త్వరగా పడుకుంటే బాగుండు ఉదయం లేవాలి అని.. అయినా నిద్ర రాకపోతే ఏం చేయాలి అన్ని మళ్లీ సెల్వ్ గా అనుకుంటారు. అయితే మీకు కూడా పడుకున్న వెంటనే నిద్ర రావడం లేదా? ఈ టిప్స్ పాటించండి వెంటనే నిద్ర పోతారు.
సంతోషంగా, సంతృప్తిగా ఉన్న వ్యక్తులు ఎక్కువ సేపు, మెరుగ్గా నిద్రపోతారు. వారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీని కారణంగా వారి శరీరం, మనస్సు త్వరగా విశ్రాంతి స్థితికి వస్తాయి. దీనికి విరుద్ధంగా, నిరాశ, ఆందోళన లేదా విచారంతో బాధపడేవారికి నిద్ర నాణ్యత తక్కువగా ఉంటుంది. అలాంటి వారు నిద్రపోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. తరచుగా మేల్కొనవచ్చు అంటున్నారు నిపుణులు.
భావోద్వేగాలు నిద్రను ప్రభావితం చేసినట్లే, సరైన నిద్ర లేకపోవడం కూడా ప్రతికూల భావోద్వేగాలను పెంచుతుంది. ఒక వ్యక్తి సరిగ్గా నిద్రపోనప్పుడు, వారి మానసిక స్థితి క్షీణించవచ్చు. మరింత ఒత్తిడికి, ఆందోళనకు లేదా నిరాశకు గురవుతారు. దీని వలన మరుసటి రోజు అతనికి విచారంగా లేదా చిరాకుగా అనిపించవచ్చు.
నిద్రను మెరుగుపరచడానికి ఏమి చేయాలి?
మీరు మీ నిద్రను మెరుగుపరచుకోవాలనుకుంటే, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే స్క్రీన్ నీలి కాంతి మెదడును చురుగ్గా ఉంచుతుంది. నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోండి. నిద్రపోవడానికి, మేల్కొనడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని పాటించండి. ధ్యానం, యోగా చేయండి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీకు మంచి నిద్ర వస్తుంది. నిద్రపోయే ముందు కెఫిన్, భారీ భోజనం మానుకోండి. ఎందుకంటే ఇవి నిద్రను ప్రభావితం చేస్తాయి. సంతోషంగా, సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. సంతోషకరమైన మనస్సు మంచి నిద్రకు సహాయపడుతుంది.
కొబ్బరి నూనెతో పాదాలను సరిగ్గా మసాజ్ చేస్తే, శరీరానికి విశ్రాంతి అందుతుంది. ఈ నూనె రాత్రి పడుకునే ముందు ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు చాలా మందికి తలనొప్పిగా కూడా ఉంటుంది. సో మసాజ్ వల్ల మంచి విశ్రాంతి ఫీల్ అనిపిస్తుంది. హెడ్ మసాజ్, అరికాల్ల మసాజ్ చేసుకోండి. టీవీ, ఫోన్, లాప్ టాప్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఒక మంచి పుస్తకం చదవండి. పడుకున్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. పడుకునే ముందు టీ, కాఫీలు అసలు తీసుకోవద్దు. రోజు ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోండి. ఎక్కువగా తినవద్దు. పడుకునే ముందు స్నానం చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Sleep Health: ఆలస్యంగా నిద్రపోతే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
-
Sleep: పగటి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత టైమ్ నిద్రపోవాలి
-
Sleep: బెడ్ ఎక్కిన వెంటనే నిద్ర పోవాలి అంటే ఇలా చేయండి..
-
Sleep: పడుకునేటప్పుడు బ్రా వేసుకుని పడుకుంటున్నారా? వామ్మో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
-
Sleep Health: అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..