Sleep: బెడ్ ఎక్కిన వెంటనే నిద్ర పోవాలి అంటే ఇలా చేయండి..

Sleep:
చాలా మంది ప్రస్తుతం నిద్ర లేమితో బాధ పడుతున్నారు. నిద్ర రావడం లేదంటూ అర్ధరాత్రి వరకు కూడా మేల్కొని ఉంటున్నారు. ఇక పొద్దున్నే లేచి ఉద్యోగాలు, పనులు, చదువులు అంటూ వెళ్లిపోతున్నారు. సరైన నిద్ర కూడా ఉండటం లేదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాకు అడెక్ట్ అవడం వల్ల ఈ నిద్ర నాణ్యత తగ్గింది. అయితే చాలా మందికి రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని ఉండే అలవాటు ఉంటుంది. ప్రజలు త్వరగా నిద్రపోవడానికి గల కారణాల గురించి చాలా పరిశోధనలు జరిగాయి. ఒక వ్యక్తి భావోద్వేగాలు అతని నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడించాయి. మన భావోద్వేగాలకు, నిద్రకు లోతైన సంబంధం ఉంది. ఆనందం, సానుకూల భావోద్వేగాలు మంచి, పొందడానికి సహాయపడతాయి. అయితే విచారం, నిరాశ నిద్రలేమి పేలవమైన నిద్రకు కారణమవుతాయి.
సంతోషంగా, సంతృప్తిగా ఉన్న వ్యక్తులు ఎక్కువసేపు, మెరుగ్గా నిద్రపోతారు. వారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అందుకే ఎక్కువగా సంతోషంగా ఉండటానికి, ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సరైన నిద్ర కోసం ఆహారం త్వరగా తినాలి. పడుకునే ముందే తినవద్దు. కనీసం నిద్రకు ఆహారానికి మధ్య గంట సమయం ఉండాలి అంటున్నారు నిపుణులు. ఇక ఒత్తిడి విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. ఒత్తిడి వల్ల పూర్తి నిద్ర కూడా డిస్ట్రబ్ అవుతుంది. కొన్ని సార్లు అర్థరాత్రి లేదా ఉదయం 2, 3 అయినా సరే నిద్ర రాకపోవచ్చు.
ఇలా ఎక్కువ సేపు నిద్రలేకపోతే ఎన్నో సమస్యల భారిన పడాల్సి వస్తుంది. అందుకే ప్రశాంతమైన వాతావరణం, సంతోషం వంటి వాటికోసం మీరు ప్రయత్నించాలి. మీ నిద్రకు ఆటంకం కలిగించే వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆ సోషల్ మీడియాకు, ఫోన్ లకు దూరంగా ఉండండి. లేదంటే నిద్ర వచ్చినా సరే ఇగ్నేర్ చేసి మరీ పడుకోవడం లేదు చాలా మంది. లేదంటే మంచి పుస్తకం చదవండి. అటోమెటిక్ గా నిద్ర వస్తుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల శరీరం, మనస్సు త్వరగా విశ్రాంతి స్థితికి వస్తాయి. అందుకే ఆనందానికి విరుద్ధంగా, నిరాశ, ఆందోళన లేదా విచారంతో బాధపడేవారికి నిద్ర నాణ్యత తక్కువగా ఉంటుంది. అలాంటి వారు నిద్రపోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. తరచుగా మేల్కొనవచ్చు.
సరైన నిద్ర లేకపోతే ప్రతికూల భావోద్వేగాలు పెరుగుతాయి. మానసిక స్థితి క్షీణించవచ్చు.ఒత్తిడికి, ఆందోళనకు లేదా నిరాశకు గురవుతారు. దీని వల్ల మరుసటి రోజు విచారంగా లేదా చిరాకుగా ఉంటారు. దీని వల్ల వారి నిద్ర చక్రంపై మరింత ప్రభావం చూపుతుంది. అందుకే మీ నిద్రను మెరుగుపరచుకోవాలనుకుంటే, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే స్క్రీన్ నీలి కాంతి మెదడును చురుగ్గా ఉంచుతుంది. నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. నిద్రపోవడానికి, మేల్కొనడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని పాటించండి. ధ్యానం, యోగా చేయాలి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీకు మంచి నిద్ర వస్తుంది. నిద్రపోయే ముందు కెఫిన్, భారీ భోజనం మానుకోండి. ఎందుకంటే ఇవి నిద్రను ప్రభావితం చేస్తాయి. సంతోషంగా, సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. సంతోషకరమైన మనస్సు మంచి నిద్రకు సహాయపడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Sleep: పడుకున్న వెంటనే నిద్ర పట్టాలా? ఇవి పాటించండి..
-
Sleep Health: ఆలస్యంగా నిద్రపోతే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
-
Sleep: పగటి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత టైమ్ నిద్రపోవాలి
-
Sleep: పడుకునేటప్పుడు బ్రా వేసుకుని పడుకుంటున్నారా? వామ్మో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
-
Sleep Health: అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..