Skin Care Tips: వేసవిలో చర్మం దెబ్బతింటుందా? ఇలా చేయండి
Skin Care Tips వేడి తీవ్రతకు చర్మం బాగా దెబ్బతింటుంది. దీంతో నల్లగా మారడం, ముడతలు రావడం వంటివి జరుగుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే వేసవిలో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.

Skin Care Tips: వేసవిలో చర్మం బాగా దెబ్బతింటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చర్మం పాడవుతుంది. ఏ కాలంలో అయినా చర్మం పాడవుతుంది. అందులోనూ వేసవిలో సూర్య రశ్మి వల్ల ఎక్కువగా పాడవుతుంది. ముఖ్యంగా మహిళలు అయితే అందం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఎందుకంటే వేసవిలో వచ్చే తీవ్ర వేడి వల్ల చర్మంపై ట్యాన్ పెరుగుతుంది. ముఖం అంతా కూడా నల్లగా మారుతుంది. దుమ్ము, ధూళి వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు వస్తాయి. అయితే వేసవిలో చర్మం పాడవకుండా ఉండాలంటే పాటించాల్సిన ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎక్స్‌ఫోలియేట్
వేడి తీవ్రతకు చర్మం బాగా దెబ్బతింటుంది. దీంతో నల్లగా మారడం, ముడతలు రావడం వంటివి జరుగుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే వేసవిలో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు అన్ని కూడా తొలగిపోతాయి. జిడ్డు, మొటిమలు, మచ్చలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మం మెరుస్తుంది. అలాగే మృదువుగా తయారు అవుతుంది. ఎలాంటి నల్లటి మచ్చలు అయినా కూడా తగ్గిపోతాయి. ముఖంపై ఉండే మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో వారానికి ఒకసారి తప్పకుండా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.
సన్‌స్క్రీన్
వేసవిలో సన్‌స్క్రీన్ తప్పకుండా వాడాలి. ఎందుకంటే సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాల వల్ల చర్మం పాడవుతుంది. అదే సన్ స్క్రీన్ వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ట్యాన్, మొటిమలు వంటివి రాకుండా ఉంటాయి. సన్ స్క్రీన్ చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ వాడాల్సిందే. లేకపోతే నల్లగా అయిపోతారు.
మేకప్ వేసుకోవద్దు
కొందరు వేసవిలో చెమటలు వస్తున్నా కూడా మేకప్ వేసుకుని బయటకు వెళ్తుంటారు. వేసవిలో మేకప్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదని నిపుణులు అంటున్నారు. మేకప్ వేసుకుంటే గాలి తగలక ముఖంపై మొటిమలు, మచ్చలు అన్ని కూడా వస్తాయి. అదే మీరు మేకప్ వేయకుండా ఉండే గాలి తగిలితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మేకప్ వేసుకునే బదులు సూర్య రశ్మి నుంచి విముక్తి కలిగేలా ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారుా.
కూలింగ్ మిస్ట్ వాడాలి
వేసవిలో చర్మాన్ని కాపాడేందుకు కూలింగ్ మిస్ట్ బాగా పనిచేస్తు్ందని నిపుణులు అంటున్నారు. ఈ కూలింగ్ మిస్ట్ చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు, ట్యాన్ వంటి వాటిని తగ్గిస్తుంది. దీనివల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి చర్మ సమస్యలు రావు. చర్మం మెరిసిపోతుంది. వేసవిలో కూడా ఫేస్ చాలా కాంతివంతంగా ఉంటుంది. సాధారణంగా వేసవిలో ఎవరి చర్మమైనా దెబ్బతింటుంది. ఇలా లోషన్లు, కొన్ని చిట్కాలు పాటిస్తేనే చర్మం దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు రాకుండా చర్మం యంగ్ లుక్‌లో ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వేసవిలో ఈ చిట్కాలు పాటించడం అసలు మిస్ కావద్దు.
-
Skin Care: ఉదయం లేచిన వెంటనే ముఖానికి వీటిని అప్లై చేస్తే.. మెరిసిపోవడం ఖాయం
-
Skin Care Tips: వచ్చింది ఎండాకాలం. జర భద్రం మీ స్కిన్..
-
Tattoos : హెచ్చరిక: మీరు టాటూలు వేయించుకున్నారా? వేయించుకోవాలి అనుకుంటున్నారా?
-
Beauty Tips : కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్ టోనర్ ఇలా తయారు చేసి, అప్లే చేసుకోండి.
-
Skin Care: ఈ కేర్ లేకపోతే మీ స్కిన్ త్వరగా పాడవడం గ్యారంటీ.. కేర్ మస్ట్ బ్యూటీ నెక్ట్స్
-
Skin Care: తేనె, పచ్చిపాలు, పసుపు చాలు మీ స్కిన్ మెరిసిపోతుంది. ఇంతకీ ఎలా ఉపయోగించాలంటే?