Skin Care: తేనె, పచ్చిపాలు, పసుపు చాలు మీ స్కిన్ మెరిసిపోతుంది. ఇంతకీ ఎలా ఉపయోగించాలంటే?

Skin Care: చర్మ సంరక్షణ చాలా అవసరం. మారుతున్న వాతావరణ దృష్యా మరింత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. చర్మానికి తేమ చాలా అవసరం. పొడిబారిన చర్మం వల్ల చికాకుతో పాటు అందవిహీనంగా కనిపిస్తుంది. మరి మీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంది? మీరు మీ స్కిన్ కు కేర్ తీసుకుంటున్నారా? లేదా? ఎంత బిజీ ఉన్నా సరే మీ కేర్ వల్ల మీ స్కిన్ గ్లోగా ఉంటుంది. సో తప్పకుండా కాస్త జాగ్రత్త తీసుకోండి డియర్స్. మంచి స్కిన్ ఉంటే కాన్ఫిడెంట్ కూడా చాలా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా సరే ఇన్నర్ ఫీల్ హ్యాపీగా ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు మనం స్కిన్ కేర్ రొటీన్ కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మీరు స్కిన్ కు కావలసిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం పొడిబారి, పొరలు గా మారుతుంది. అంతేకాదు అకాల వృద్ధాప్యం వస్తుంది. అందుకే మారుతున్న వాతావరణం దృష్ట్యా స్కిన్ కేర్ చాలా అవసరం అంటున్నారు నిపుణులు. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండోయ్. జస్ట్ పసుపు, పచ్చి పాలు, తేనె సరిపోతుంది. మరి వీటితో ఏం చేయాలో కూడా చూసేద్దామా?
తయారీ విధానం: మాస్క్ తయారు చేసుకోవడానికి పచ్చిపాలు, కాస్త పసుపు యాడ్ చేయాలి. ఈ మిశ్రమంలో కాస్త తేనె వేసి బాగా కలిపి మంచి మిశ్రమం లా చేసుకోవాలి. అంతే మీకు కావాల్సిన ఫేస్ మాస్క్ తయారు అయిపోయింది. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కదా. కానీ ముందు జాగ్రత్తగా కాస్త ప్యాచ్ టెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొందరికీ అలెర్జీ ఉంటుంది. అలాంటి వారు ఇలా ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
స్కిన్ ఎర్రగా మారినా, దద్దుర్లు వంటివి వచ్చినా లేదా కమిలి పోయినా సరే ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ మాస్క్ మిమ్మల్ని వృద్ధాప్య స్కిన్ నుంచి దూరంగా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్లు A, D, E లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక పచ్చిపాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. చర్మ కణాలు తొలిగిపోయినప్పుడు ఈ మాస్క్ వాడటం వల్ల మీ స్కిన్ మెరుస్తుంది. ఇక మొటిమలు, మచ్చల నుంచి కూడా ఉపశమనం కలిగించేలా చేస్తుంది.
ఇక సున్నితమైన చర్మం ఉన్నవారు కూడా ఈ పసుపు పాల మాస్క్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాపు, ఎరుపు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను పోగొడుతుంది. పసుపులోని కర్కుమిన్ మొటిమల వల్ల వచ్చిన మచ్చలను మాయం చేస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Skin Care Tips: వేసవిలో చర్మం దెబ్బతింటుందా? ఇలా చేయండి
-
Health Issues: ఎక్కువగా చెమటలు వస్తున్నాయా.. మీకు ఈ సమస్యలు ఉన్నట్లే
-
Tattoos : హెచ్చరిక: మీరు టాటూలు వేయించుకున్నారా? వేయించుకోవాలి అనుకుంటున్నారా?
-
Beauty Tips : కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్ టోనర్ ఇలా తయారు చేసి, అప్లే చేసుకోండి.
-
Ramadan: రంజాన్ మాసంలో రోజంతా యాక్టివ్గా ఉండాలంటే.. సహూర్లో తీసుకోవాల్సినవి ఇవే
-
Skin Care: ఈ కేర్ లేకపోతే మీ స్కిన్ త్వరగా పాడవడం గ్యారంటీ.. కేర్ మస్ట్ బ్యూటీ నెక్ట్స్