Rice Water: రైస్ వాటర్ వల్ల జుట్టుకు ఇన్ని ప్రయోజనాలా? ఎలా వాడాలంటే?

Rice Water:
ఎక్కడ చూసినా పొడవు జుట్టుతో కనిపిస్తున్నారా? వారి జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా ఉందా? సో మీకు కోపం వస్తుంది కదా. మీ గడ్డి జుట్టు, పొట్టి జుట్టును చూస్తే నాకు ఎందుకు లేదు వారిలా జుట్టు అనిపిస్తుంది కదా. ఇది అందరూ ఫీల్ అయ్యేదే. కానీ అందరికీ అన్ని రకాలుగా ఉండటం అంటే కష్టమే. బట్ ఉన్నదాంట్లో కాస్త మార్పులు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక కొన్ని మంచి టిప్స్ పాటిస్తే రిజల్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీని కోసం మీరు ఓ వేలకు వేలు పార్లర్ల చుట్టూ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కిచెన్ మీ జుట్టును సూపర్ చేస్తుంది.
యస్ జస్ట్ రైస్ మీ జుట్టుకు మంచి మెరుపును తెస్తాయి. బియ్యం నీళ్లు మీ చర్మాన్ని మాత్రమే కాకుండా మీ జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి బియ్యం నీటిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. కానీ చాలా మందికి ఈ సింపుల్ టిప్ గురించి తెలియదు. సో అది ఈ రోజు మనం తెలుసుకుందాం.
బియ్యం నీరులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు బలాన్ని, ఆకృతిని, పెరుగుదలను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్లు బి, ఇ, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు మీ తలకు పోషణనిస్తాయి. జుట్టు రంధ్రాలను బలోపేతం చేస్తాయి. పులియబెట్టిన బియ్యం నీరు దాని ప్రయోజనాలను పెంచుతుంది. ఈ ప్రక్రియ ఇనోసిటాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దెబ్బతిన్న జుట్టును మరమ్మతు చేస్తుంది. తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు అన్నమాట.
ఇంతకీ ఎలా తయారు చేయాలంటే?
బియ్యం నీరు నిజానికి స్టార్చ్ అధికంగా ఉండే ద్రవం. ఉడికించిన బియ్యాన్ని వడకట్టడం ద్వారా లేదా బియ్యం నీటిలో పూర్తిగా కరిగిపోయే వరకు ఉడకబెట్టి తయారు చేసుకోవచ్చు. ఇది శతాబ్దాలుగా జుట్టు సంరక్షణ కోసం వాడుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలి-
ముందుగా, ½ కప్పు బియ్యాన్ని బాగా కడగాలి. ఇప్పుడు దానిని 2 కప్పుల నీటిలో వేసి చిక్కబడే వరకు మరిగించి, ఆ నీటిని వడకట్టండి. బియ్యం నీళ్ళు చల్లబరచాలి. మీరు దానిని గది ఉష్ణోగ్రత వద్ద 24 గంటలు వదిలివేయండి. దీని వల్ల కిణ్వ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇప్పుడు బియ్యం నీటిని శుభ్రమైన, తడి జుట్టుకు రాయండి. దీన్ని తలకు మసాజ్ చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచండి. చివరగా జుట్టును నీటితో కడగాలి. మీరు వారానికి 1-2 సార్లు బియ్యం నీటిని ఉపయోగించవచ్చు. అయితే, దీన్ని ఎక్కువగా వాడవద్దు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల మీ జుట్టు గరుకుగా మారే అవకాశం ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.