Relationship: ఈ సంకేతాలు ఉంటే మీ పార్టనర్ మీ నుంచి దూరం కోరుకుంటున్నట్టే..

Relationship:
ఏ రిలేషన్ అయినా సరే ముందు చాలా అందంగా, మధురంగా అనిపిస్తుంది. కానీ తర్వాతనే ఆ రిలేషన్ బోర్ గా అనిపిస్తుంది. కొత్త వస్తువు నచ్చినట్టుగా పాత వస్తువు నచ్చదు కదా. అందుకే కొత్త మురిపం అంటారు కదా. అదంతా పక్కన పెడితే మీ రిలేషన్ లో కొందరు మిమ్మల్ని వదిలి వెళ్లాలి అనుకుంటున్నారు అని మీరు ముందే తెలుసుకోవచ్చు. ఎలా అంటారా?
ప్రవర్తనలో మార్పు:
ప్రేమ, గౌరవం, నమ్మకం అనే పునాదిపై ఆధారపడిన సంబంధం, భాగస్వాములిద్దరూ ఒకరి భావాలను ఒకరు గౌరవించుకున్నంత కాలం మాత్రమే బలంగా ఉంటుంది. కానీ వీటిలో ఏ విషయం బలహీనపడినా సరే సంబంధం విచ్ఛిన్నం అవుతుంది. మీ భాగస్వామి మీతో ఇంతకు ముందులాగా ఉండటం లేదా? ముఖ్యంగా ఏ విషయం గురించి మాట్లాడటం లేదా? మీరు చెప్పే దానిపై ఆసక్తి చూపించడం లేదా?అంటే మీ విషయంలో వారు ఆల్రెడీ దూరం అవుతున్నారు అని అర్థం. ప్రతి సారి వాయిదా వేయడం, బిజీగా ఉన్నానని సాకులు చెప్పడం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం, మునుపటిలాగా మాట్లాడటానికి ఆసక్తి చూపడం లేదంటే మీరు ఆలోచించాల్సిందే.
శారీరక – భావోద్వేగ దూరం
మీ భాగస్వామి మునుపటిలాగా శ్రద్ధ వహించడం లేదని అనిపిస్తుందా? అతను మీకు దగ్గరగా రావడానికి, మీ చేయి పట్టుకోవడానికి లేదా ఇంట్రెస్ట్ చూపించడం లేదా? అసలు హగ్ కూడా చేసుకోవడం లేదా? అయితే వారు మీ నుంచి మానసికంగానే కాదు శారీరకంగా కూడా దూరం అవుతున్నట్టే.
చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం
ప్రేమ, పరస్పర అవగాహన సంబంధంలో ముఖ్యమైనవి. కానీ మీ భాగస్వామి ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం ప్రారంభిస్తే, వారు లోలోపల ఇబ్బంది పడుతున్నారని అర్థం. కొన్నిసార్లు ఈ గొడవల వల్ల అతను మీ నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు.
భవిష్యత్తు ప్రణాళిక:
మీ భాగస్వామి తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలలో మిమ్మల్ని ఇన్ క్లూడ్ చేయడం లేదా? అంటే ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిందే. అకస్మాత్తుగా తన కెరీర్, ప్రయాణ ప్రణాళికలు లేదా ఇతర విషయాలకు సంబంధించి మీ నుంచి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే, అతను ఈ సంబంధాన్ని కొనసాగించే మూడ్‌లో లేరని సంకేతం కావచ్చు.
సామాజిక జీవితంలో దూరం
మీ భాగస్వామి గతంలో మిమ్మల్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి ఆసక్తి చూపి, ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకుని తన స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నాడా? ఇది కూడా ఒక హెచ్చరిక కావచ్చు. అంటే తన లైఫ్ లో మీకు దూరం మొదలైంది అని అర్థం.
ఈ సంకేతాలు కనిపిస్తే ఏమి చేయాలి?
ఇలాంటి సంకేతాలు మీ లైఫ్ లో ఉంటే గొడవ పడకుండా, బాధ పడకుండా, ఇబ్బంది పడకుండా ముందుగా కూర్చొని మాట్లాడండి. వారు ఏం అనుకుంటున్నారు? వారి మనసులో ఏం ఉంది? అనే విషయాలు ముందుగా తెలుసుకోండి. చిన్న చిన్న విషయాల వల్ల ఇలా చేస్తే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. లేదంటే కౌన్సిలింగ్ తీసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? సంబంధాన్ని కాపాడుకోవడానికి, భాగస్వాములిద్దరి ప్రయత్నాలు చాలా అవసరం. మీరిద్దరూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ సంబంధం మళ్ళీ బలపడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Relationship : ముందు ప్రేమ, తర్వాత వివాహం, ఆ తర్వాత పశ్చాత్తాపం.. బట్ ఎందుకు?
-
Love: ప్రేమ కోసం మీరు మారుతున్నారా?
-
Relationship: మీతో వారు అసలు మాట్లాడటం లేదా? సైలెంట్ మెయింటెన్ చేస్తున్నారా? తప్పు నీదే
-
Relationship: ప్రేమ ఉన్న సరే మీరు విడిపోతారు? ఎందుకంటే?
-
Relationship: ఈ చిన్న విషయాలను పెద్దగా చేస్తున్నారా? అయితే బాండింగ్ బ్రేక్ తప్పదు
-
Relationship : మీ మాజీకి రెండవ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా?