Natural colors : ఇంట్లోనే సహజ రంగులు తయారు చేయడం ఎలాగో మీకు తెలుసా?

Natural colors : హోలీ అంటే రంగులే. చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరూ కూడా రంగులతో హోలీ పండుగను జరుపుకుంటారు. రకరకాల రంగులతో హోలీ రోజు ఆటలు ఆడుతుంటారు. అయితే ప్రస్తుతం హోలీ రంగుల్లో ఎక్కువగా రసాయనాలు వాడుతున్నారు. కెమికల్స్ ఎక్కువగా ఉండే రంగులను ఒంటిపై చల్లుకోవడం వల్ల చర్మ సమస్యలు, అలెర్జీ వంటివి వస్తాయి. ఈ విషయం తెలిసినా కూడా చాలా మంది ఇలాంటి రంగులనే వాడుతారు. మార్కె్ట్లో కూడా ఇలాంటి రంగులే ఎక్కువగా లభ్యమవుతుంటాయి. అదే మీరు రంగులను ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. హోలీకి ఇంట్లోనే ఈజీగా సహజ రంగులను తయారు చేసుకుంటే.. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అయితే కొందరికి సహజ రంగులను తయారు చేసుకోవడం ఎలాగో సరిగ్గా తెలియదు. మరి ఇంట్లోనే సహజ రంగులను తయారు చేసుకోవడం ఎలాగో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
బీట్రూట్
దీంతో ముదురు ఎరుపు రంగును ఈజీగా తయారు చేసుకోవచ్చు. తాజా బీట్రూట్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా తురుముకోవాలి. ఆ తర్వాత రసాన్ని బయటకు తీసేసి.. ఈ ఆ తురుమును ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అంతే ఇక సహజమైన ఎరుపు రంగు తయారు అయినట్లే.
ఆకుకూరలు
కేవలం పాలకూర అనే కాకుండా ఆకు కూరలతో గ్రీన్ కలర్‌ను తయారు చేసుకోవచ్చు. పాలకూర ఆకులను బాగా కడిగి మరిగించాలి. ఆ తర్వాత ఆకులను బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అంతే ఇక సహజమైన ఆకుపచ్చ రంగు రెడీ అయినట్లే.
క్యారెట్
క్యారెట్‌తో ఆరెంజ్ కలర్‌ను తయారు చేసుకోవచ్చు. క్యారెట్లను బాగా శుభ్రం చేసిన తర్వాత బాగా తురుముకోవాలి. ఈ తురుమును ఎండలో ఎండబెట్టిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇలా క్యారెట్‌తో మీకు ఇలా సహజమైన ఆరెంజ్ కలర్ రెడీ అయినట్లే.
పసుపు
పసుపు అనేది అందరి ఇంట్లో కూడా ఉంటుంది. సహజమైన పసుపు రంగును పసుపు కొమ్ముల నుంచి తయారు చేసుకోవచ్చు. పసుపు సహజంగా పచ్చిగా ఉంటుంది. దీన్ని ఎండపెడితే గట్టిగా మారుతుంది. ఇలా ఎండపెట్టిన పసుపును మెత్తగా పొడి చేసుకుంటే పసుపు కలర్ రెడీ అయినట్లే.
గులాబీలు
గులాబీ పువ్వులతో ఇంట్లోనే ఈజీగా గులాబీ రంగును తయారు చేసుకోవచ్చు. గులాబీలను బాగా కడిగిబెట్టి ఎండలో వేసుకోవాలి. ఇవి ఎండిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీలో వేసుకుని పొడి చేసుకుంటే చాలు. మీకు కావాల్సిన గులాబీ రంగు రెడీ.
బంతి పువ్వులు
పసుపు, కాస్త ఆరెంజ్ రంగులు కలిపి రావాలంటే బంతి పువ్వులు బాగా ఉపయోగపడతాయి. బంతి పువ్వులను పూర్తిగా విడగొట్టాలి. వీటిని నీళ్లలో వేసి కడిగి ఎండపెట్టాలి. ఆ తర్వాత మిక్సీ చేసి మెత్తగా పొడి చేసుకుంటే చాలు. కలర్ తయారు అయినట్లే.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
-
Success Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. అంబానీ కంటే ధనవంతులు మీరే