Mouth Cancer : నోటి క్యాన్సర్ ఉంటే మీరే సులభంగా గుర్తించవచ్చు? ఎలాగంటే?

Mouth Cancer : ప్రస్తుతం శరీరంలోని ప్రతి అవయవానికి కూడా క్యాన్సర్ వస్తుంది. ఎవరిని ఏ క్యాన్సర్ బలి తీసుకుంటుందో కూడా చెప్పడం కష్టమే. అందుకే శరీరం పంపే కొన్ని సంకేతాలను అర్థం చేసుకొని ముందుగానే క్యాన్సర్ ను గుర్తిస్తే ఈ వ్యాధిని నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక కొందరికి నోట్లో కూడా క్యాన్సర్ వస్తుంటుంది. వారికి ఎక్కువగా నోట్లో పుండ్లు వస్తాయి. ఇలా వస్తే చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ అవి క్యాన్సర్ కారకాలు కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. నోరు లేదా పెదవులలో గడ్డలు లేదా గట్టిపడటం, ఎరుపు లేదా తెలుపు మచ్చలు, నమలడంలో ఇబ్బంది వస్తే మాత్రం కచ్చితంగా అనుమానించాల్సిందే.
మింగడంలో లేదా మాట్లాడటంలో ఇబ్బంది కాబట్టి ఈ లక్షణాలు కంటిన్యూ అయితే ఆలస్యం చేయకండి. పుండ్లు, పూతల లేదా పెదవులపై కొన్ని వారాలలో నయం కాని పుండ్లు ఉంటే కూడా అనుమానించాల్సిందే. ఇవి నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కావచ్చు అంటున్నారు నిపుణులు. నోటి క్యాన్సర్ నోటిలోనే కాకుండా పెదవులు, చిగుళ్లు, నాలుకలో కూడా వస్తుంది.
మొదటి దశలో నోటి క్యాన్సర్ ను ఇలా గుర్తించండి..
1. దంతాలు వదులుగా మారడం: దంతాలు అకస్మాత్తుగా వదులుగా మారుతుంటే, అది నోటి క్యాన్సర్ ప్రారంభ సంకేతం కావచ్చు.
2. మెడ చుట్టూ ఒక గడ్డ కనిపించడం: నోటిలో లేదా మెడలో ఎక్కడైనా ఒక ముద్ద అంటే గడ్డ వంటిది కనిపిస్తే, దానిని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనది కావచ్చు.
3. పెదవులపై వాపు లేదా నయం కాని పుండ్లు ఉన్నా లైట్ తీసుకోవద్దు.
4. మింగడంలో ఇబ్బంది లేదా నొప్పి ఉంటే అది క్యాన్సర్ కావచ్చు.
5. మాటల్లో మార్పు వస్తుంది.
6. నోటిలో రక్తస్రావం లేదా తిమ్మిరి వస్తుంటుంది.
7. నాలుక లేదా చిగుళ్ళపై తెల్లటి లేదా ఎరుపు రంగు మచ్చలు వస్తాయి
8. బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి.
నోటి క్యాన్సర్ కారణాలు
1. పొగాకు లేదా ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం
2. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)
3. ఎప్స్టీన్-బార్ వైరస్ (EBV)
4. జన్యుశాస్త్రం
5. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం
6. చిగుళ్ల వ్యాధి
7. ఎండకు ఎక్కువగా గురికావడం
8. తమలపాకును ఎక్కువగా నమలడం
నోటి క్యాన్సర్ కు చికిత్స ఏమిటి?
1. నోటి క్యాన్సర్ చికిత్స దాని రకం, స్థానం పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
2. CT, MRI స్కాన్ల వంటి పరీక్షలు క్యాన్సర్ ఎంత పెరిగిందో చూపిస్తాయి. చికిత్సను నిర్ణయించుకోవడానికి వైద్యులు స్టేజింగ్‌లో సహాయపడుతుంది.
3. నోటి క్యాన్సర్‌కు సాధారణ చికిత్స శస్త్రచికిత్సనే. దాని సహాయంతో కణితిని తొలగిస్తారు. ప్రారంభ దశ క్యాన్సర్‌లో శస్త్రచికిత్స ప్రభావవంతంగా ఉంటుంది.
4. కొన్ని చిన్న నోటి క్యాన్సర్లను రేడియోథెరపీతో చికిత్స చేయవచ్చు.
5. కీమోథెరపీ కణితులను చంపడానికి లేదా కుదించడానికి మందులను ఉపయోగిస్తుంది.
-
Cancer: పాలియేటివ్ కేర్‌తో క్యాన్సర్ నుంచి ఉపశమనం
-
Red Rice : వైట్ కంటే ఈ రైస్ ఎందుకు ఆరోగ్యానికి మంచివి?
-
Tea and Coffee : టీ , కాఫీలు ఎక్కువ తాగితే పిల్లలు పుట్టరా?
-
Cancer: సన్ స్క్రీన్ క్యాన్సర్ ను తెస్తుందా? క్యాన్సర్ రాకుండా కాపాడుతుందా?
-
Periods : పీరియడ్స్ సమయంలో కాళ్లు నొస్తున్నాయా? ఎందుకు? ఏం చేయాలి?
-
Gastric Problem : గ్యాస్ సమస్యతో బాధ పడుతున్నారా? ఇంతకీ ఎందుకు ఈ సమస్య వస్తుంది. నివారణ మార్గాలు ఏంటి?