Money Investment Tips: 15x15x15 రూల్‌తో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే?

Money Investment Tips:
డబ్బులు సంపాదించాలని, భవిష్యత్తులో పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చాలా మంది ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే వారు సంపాదించిన మొత్తంలో కొత్త డబ్బు్ను దాచిపెడుతుంటారు. ఇవి భవిష్యత్తులో పిల్లల చదువు, పెళ్లి, అనారోగ్య సమస్యలు ఇలా ఏదో విధంగా ఉపయోగపడుతుంది. కొందరు బ్యాంకుల్లో డబ్బులు దాచిపెడితే మరికొందరు మాత్రం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడుతుంటారు. ఇలా డబ్బులు పెట్టడం వల్ల భవిష్యత్తులో లాభాలు వస్తాయి. అయితే పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే కొన్నింట్లో రిస్క్ ఉంటుంది. పెట్టిన డబ్బు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ కొన్నింట్లో డబ్బు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రిస్క్ లేకుండా మీరు పెట్టిన డబ్బు అంతా కూడా రిటర్న్ వస్తుంది. అయితే మీరు సంపాదించిన డబ్బులో కొంత మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే మంచి లాభాలు ఉంటాయి. వీటిలో పెట్టిన తర్వాత ఎలాంటి రిస్క్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌లో పెడితేనే బాగా లాభాలు ఉంటాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ లాభాలు రావడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు నెల వారీగా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరి ఈ సిప్‌లో పెట్టుబడులు పెట్టడం ఎలా? 15x15x15 రూల్ పెట్టుబడి విషయంలో ఎలా ఉపయోగపడుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
మీరు సిప్‌లో పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయి. ఎలాంటి రిస్క్ లేకుండా మీకు లాభాలు వస్తాయి. అయితే మీరు ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం వాటిని తీసేయవచ్చు. మీరు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు 15x15x15 రూల్ పాటించి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మీకు ఒక 15 ఏళ్ల తర్వాత కోటి రూపాయలు కావాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా 15x15x15 రూల్ పాటించాలి. మీరు ప్రతీ నెల ఒక రూ.15000 లు సిప్ చేయాలి. ఇలా మీరు 15 ఏళ్ల పాటు రూ.15 వేలు పెట్టుబడి పెడితే మీకు రిటర్న్ ఉంటాయి. మీరు 15 ఏళ్ల పాటు ఇలా పెట్టుబడి పెట్టిన మొత్తం డబ్బు రూ.27 లక్షలు అవుతుంది. అదే 15 శాతం వార్షిక రాబడి చొప్పున మీకు రూ.74.52 లక్షలు అవుతుంది. మీకు 15 ఏళ్ల తర్వాత దాదాపుగా రూ.1.01 కోట్లు వస్తుంది. అంటే ఇది కేవలం 15 శాతం రాబడి మాత్రమే. ఇంతకంటే ఎక్కువగా ఉంటే మీకు ఇంకా ఎక్కువగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీరు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెడితే నష్టాలు రావచ్చు. రిస్క్ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే మాత్రం మీకు ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు వస్తాయి. వీటిలో దీర్ఘకాలంగా, తాత్కలికంగా కూడా డబ్బు్లు ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెద్దగా రిస్క్ ఉండదు కాబట్టి హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు.