Investment: మూడేళ్లలో కోటీశ్వరులు కావాలంటే.. వీటిలో ఇన్వెస్ట్ చేయండి
Investment స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్. డబ్బులు వస్తాయో రావో తెలియదు. కొన్నిసార్లు నష్టాలు ఎక్కువగా వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే రిస్క్ ఉంటుంది.

Investment: కోటీశ్వరులు కావాలని ప్రతీ ఒక్కరూ కూడా కోరుకుంటారు. డబ్బులకు అసలు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అనుకుంటారు. తాము డబ్బుల విషయంలో పడిన కష్టాలు, తమ పిల్లలు పడకూడదని అనుకుంటారు. అలాగే భవిష్యత్తులో ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇబ్బందులు ఉండకూడదని డబ్బులు సేవ్ చేస్తారు. దీనికోసం నెలలో వచ్చే కొంత జీతాన్ని దాచి పెడతారు. మరికొందరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో కొందరికి లాభాలు వస్తే.. మరికొందరికి నష్టాలు వస్తాయి. వీటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా అవగాహన కూడా ఉండాలి. లేకపోతే డబ్బులు నష్టపోతారు. దీంతో ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఎలాంటి నష్టాలు రాకుండా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే పెట్టుబడులు కోసం చాలా మంది చూస్తుంటారు. మిగతా అన్నింట్లో కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. కేవలం కొన్నేళ్లలో మీరు కోటీశ్వరులు అయిపోతారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్. డబ్బులు వస్తాయో రావో తెలియదు. కొన్నిసార్లు నష్టాలు ఎక్కువగా వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే రిస్క్ ఉంటుంది. కానీ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పాటు లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే మార్కెట్‌లో ఉండే హెచ్చుతగ్గుల బట్టి వీటిలో లాభాలు వస్తాయి. ఇందులో కూడా మీరు మంచి వాటిలో ఇన్వెస్ట్ చేస్తేనే లాభాలు వస్తాయి. వీటి గురించి అవగాహన ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే అసలు చేయకూడదు. ఎందుకంటే డబ్బులు నష్టపోతారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో కొన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తేనే లాభాలు ఉంటాయి. మీరు నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కేవలం మూడు ఏళ్లలో గొప్ప లాభాలను పొందుతారు.
వీటిలో పెట్టుబడులు పెడితే పెట్టుబడిదారులకు 17.03 శాతం వార్షిక రాబడి వస్తుంది. దీనివల్ల మీరు కేవలం మూడేళ్లలో కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసే బట్టి రాబడి వస్తుంది. ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయి. అదే తక్కువగా చేస్తే తక్కువ లాభాలు వస్తాయి. వీటితో పాటు ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటిలో పెట్టుబడి పెడితే 15.30 శాతం రాబడి వస్తుంది. వీటితో పాటు బరోడా బిఎన్‌పి పారిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్ కూడా పెట్టుబడిదారులకు మంచి లాభాలను ఇస్తుంది. వీటిలో మీరు ఇన్వెస్ట్ చేసిన మూడేళ్లలోనే ఎక్కువగా లాభాలు పొందుతారు. మీరు కూడా ధనవంతులు కావాలని కోరుకుంటే వీటిలో మీ బడ్జెట్ బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీరు మూడేళ్లలో రిచ్ అవుతారని మార్కెట్ నిపుణులు అంటున్నారు.