Mole Astrology: ఆడవాళ్లకు ఈ ప్లేస్‌లో పుట్టుమచ్చ ఉంటే అదృష్టమే.. ఇక వీరికి తిరుగే ఉండదు

Mole Astrology: అమ్మాయిల అదృష్టం అనేది పెళ్లి తర్వాతే తెలుస్తుంది. అయితే వారి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చ బట్టి వారికి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. శరీరం మీద ప్రతీ ఒక్కరికి కూడా పుట్టుమచ్చలు ఉంటాయి. ఒక్కోక్కరికి ఒక్కో ప్లేస్‌లో పుట్టుమచ్చలు ఉంటాయి. వారికి పుట్టమచ్చలు ఉన్న ప్రదేశాలను బట్టి వారికి జీవితంలో ఏం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. అయితే అమ్మాయిలకు కనుబొమ్మల్లో పుట్టుమచ్చలు ఉంటే వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరట. ఎందుకంటే ఇలా కనుబొమ్మల్లో పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా తెలివైన వారట. అలాగే వీరు జీవితంలో ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు. ధనవంతులు జాబితాలో వీరు కూడా ఉంటారు. అయితే కుడి లేదా ఎడమ కనుబొమ్మల మీద పుట్టుమచ్చలు ఉంటే.. అలాంటి స్త్రీలు ఎంత డబ్బు సంపాదించినా కూడా నిల్వ ఉండదు. ఏదో రకంగా డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. కోట్లు సంపాదించినా కూడా డబ్బు నిల్వ ఉండదు. కొందరు అమ్మాయిలకి కంటి లోపల పుట్టుమచ్చలు ఉంటాయి. ఇలాంటి అమ్మాయిలు చాలా కూల్‌గా ఉంటారు. ప్రతీ విషయాన్ని కూడా ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటారు. కానీ ఇతరుల దగ్గర మాత్రం ఏం తెలియకుండా కనిపిస్తారు. వీరు ఎక్కువగా ధనవంతులను వివాహం చేసుకుంటారు.
కొందరికి చెవి లోపల పుట్టు మచ్చలు ఉంటాయి. ఇలాంటి స్త్రీలు చాలా మంచివారట. ఎలాంటి సందర్భాల్లో కూడా వీరు బుద్ధిని మార్చుకోరు. అలాగే వీరు జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి జీవితం కూడా ఎంతో సాఫీగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు. ఇతరులను తొందరగా అర్థం చేసుకోగలరు. అలాగే ముక్కు, పెదవుల మధ్య భాగంలో అమ్మాయిలకు పుట్టుమచ్చలు ఉంటే వారి జీవితం ఏమవుతుందో వారికి కూడా సరిగ్గా తెలియదు. అదే పెదవుల కింద పుట్టుమచ్చలు ఉంటే ఆ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వీరు ఇతరులకి ఎంతో ఆకర్షణతో కనిపిస్తారు. వీరికి ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అదే పెదవుల కింద పుట్టుమచ్చ ఉండే అమ్మాయిలు దేవుడికి మీద ఎక్కువ భక్తితో ఉంటారు. కష్టాలను దాటి.. విజయాలను ఈజీగా అందుకుంటారు. కొందరు అమ్మాయిలకు బుగ్గల మీద పుట్టుమచ్చలు ఉంటాయి. అలాంటి వారు స్నేహితులతో మంచి సంబంధాలు కుదుర్చుకుంటారు. అలాగే మంచి భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. రాణిలాంటి జీవితాన్ని గడుపుతారు. వీరు చాలా తెలివైన వారు. ప్రతీ విషయంలో కూడా ఎంతో చాకచక్యంతో వ్యవహరిస్తుంటారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.