Mirajasmine : ఆ కారణంగా భర్తతో విడిపోవాలనుకుంటున్న మీరాజాస్మిన్…మీరా భర్త వేలకోట్ల ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…

Mirajasmine :
ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీరాజాస్మిన్ తన భర్తకు బ్రేకప్ చెప్పి విడిపోయింది అనే వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మీరాజాస్మిన్ భర్తకు వేలకోట్ల ఆస్తులు ఉన్నా కూడా కాదనుకున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేక మార్కులు క్రియేట్ చేసుకుంది హీరోయిన్ మీరాజాస్మిన్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమ్మాయి బాగుంది అనే సినిమాతో మీరాజాస్మిన్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన నటనతో, లుక్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత మీరాజాస్మిన్ గుడుంబా శంకర్, భద్ర, మహారధి, రారాజు, యమగోల మళ్ళీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ, ఆకాశరామన్న వంటి పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. వరుస సినిమాలతో కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే మీరాజాస్మిన్ అనిల్ జాన్ టైటస్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. 2014 ఫిబ్రవరి 9న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే అనిల్ జాన్ టైటస్ కు ఇది రెండో వివాహం. ఇక పెళ్లి తర్వాత మీరాజాస్మిన్ తన భర్తతో కలిసి దుబాయ్ వెళ్ళింది. ఈ మధ్యకాలంలో మీరాజాస్మిన్ తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అనిల్ జాన్ టైటస్ బడా వ్యాపారవేత్త అని సమాచారం. అనిల్ కు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈయనకు కోట్ల రూపాయల సంపాదన ఉందట.
అనిల్ దగ్గర వేలకోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయని సమాచారం. అయితే గతంలో వెండి తెర మీద స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన మీరాజాస్మిన్ మళ్లీ తన నటన వృత్తిని ప్రారంభించాలని అనుకోవడంతో ఈ జంట మధ్య విభేదాలు వచ్చాయని టాక్ వినిపిస్తుంది. దీని గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. వీరిద్దరు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం మీరాజాస్మిన్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందట. పెళ్లి తర్వాత మీరా జాస్మిన్ సినిమాలకు దూరంగా ఉంటుంది. దాదాపు ఈమె 10 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. రీసెంట్గా ఈమె తన లేటెస్ట్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది.
సామాజిక మాధ్యమాల్లో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వరుస సినిమా అవకాశాలను అందుకోబోతుంది. తన కెరియర్ స్టార్టింగ్ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది మీరాజాస్మిన్. గుడుంబా శంకర్ సినిమాతో ఈమె బాగా ఫేమస్ అయింది. మళ్లీ ఈమె ఇన్నాళ్లకు సినిమాల్లోకి వచ్చి మరోసారి రాణించాలని అనుకుంటుంది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. లేటెస్ట్ గా వచ్చిన విమానం సినిమాలో ఈమె నటించింది. ఫిజిక్ పరంగా తాను ఎంతలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అనేది చూపిస్తూ తన నాజుకు అందచందాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
-
Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!
-
Tollywood Heroine : రెండు జడలు వేసుకుని సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న ఈ చిన్నారి టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా..
-
Tollywood Heroine : అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఏ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
-
Tollywood Heroine : తెలుగులో ఒక్క సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది.. డాక్టర్ గా చేస్తూనే సినిమాల్లో హీరోయిన్ గా.. ఎవరో గుర్తుపట్టారా…