Life style: కోడలికి ఈ అలవాట్లు ఉంటే.. మీ ఇంట్లో ఇక నరకమే!

Life style:
పెళ్లి అనేది ప్రతీ అమ్మాయి జీవితంలో చాలా ముఖ్యం. పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లయిన తర్వాత వచ్చిన కుటుంబం బట్టే ఆమె జీవితం ఆధారపడి ఉంటుంది. అత్తవారిళ్లు, భర్త, అత్త మామల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. 20 ఏళ్ల పాటు కన్నవారింట్లో ఎంతో గారాబంగా పెరిగిన అమ్మాయి అత్తవారింటికి వెళ్తే ఎన్నో త్యాగాలు చేస్తుంది. తినే ఫుడ్ నుంచి ధరించే దుస్తుల వరకు అన్ని కూడా అత్త వారి ఇష్టంతోనే ఉంటుంది. పెళ్లయిన తర్వాత మంచి భర్త రావడం ఎంత అదృష్టమో.. మంచి అత్త రావడం కూడా అంతే అదృష్టం. ప్రతీ అత్త కూడా కూతురులాంటి కోడలు రావాలని కోరుకుంటుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు కోడలిగా ఫెయిల్ అవుతున్నారు. చిన్న విషయాలకు గొడవలు పడి అత్తవారింటికి దూరం అవుతున్నారు. అయితే కోడలికి కొన్ని లక్షణాలు ఉండకూడదు. వాటివల్ల అత్తవారింట్లో ఎప్పుడూ కూడా నరకంగానే ఉంటుంది. అయితే కోడలికి ఉండకూడని ఆ లక్షణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇతరుల గురించి చెడుగా చెప్పడం
కొందరు కోడళ్లు ఇతరుల గురించి చెడుగా చెబుతుంటారు. ఇలాంటి అమ్మాయిలను అసలు కోడలిగా చేసుకోకూడదు. ఎందుకంటే కుటుంబం కలిసేలా మాట్లాడాలి. కానీ విడిపోయే విధంగా మాట్లాడకూడదు. కోడలు అంటే ఇంటి బాధ్యతలను అన్ని తీసుకుని.. మంచి తోవలో నడవాలి. అంతే కానీ ప్రతీ విషయానికి ఇతరులతో గొడవలు పడి, ఇతరుల గురించి చెడుగా చెప్పి పుల్లలు పెట్టే విధంగా ఉండకూడదు. వీరివల్ల ఆ కుటుంబంలో సంతోషమే ఉండదు.
స్వార్ధం
తమ స్వార్థమే చూసుకునే అమ్మాయిలను అసలు కోడలిగా తెచ్చుకోకూడదు. కోడలు అంటే.. కుటుంబంలో అందరి గురించి ఆలోచించాలి. తన సుఖం, తన అవసరాలే కాకుండా అందరి గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది.
కోరికలు
కోరికలు ఉండాలి. కానీ అధిక కోరికలు మంచివి కావు. అధిక కోరికలు కోడలికి అత్తవారింట్లో సమస్యలను తెచ్చిపెడుతుంది. భర్త అత్త మామలకు నరవేదన మొదలవుతుంది. ఎందుకంటే కోడలు కోరుకున్న ప్రతీ విషయాన్ని చేయలేరు. దీంతో కుటుంబంలో గొడవలు వస్తాయి. ఇంటికి వచ్చిన కోడలు అన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అర్థం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబంలో సంతోషంగా ఉంటారు.
జోక్యం చేసుకోకూడదు
కోడలు తన లిమిట్స్‌లో ఉండాలి. అన్ని విషయాల్లో ముఖ్యంగా ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకూడదు. దీనివల్ల ఇంట్లో గొడవలు వస్తాయి. అదే తన పని చేసుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యలు కూడా రావు.
నెగిటివ్‌గా చెప్పకూడదు
ఇంట్లో వారి కోసం కోడలు ఇతరులతో నెగిటివ్‌గా చెప్పకూడదు. దీనివల్ల ఇతరులు చులకన చూస్తారు. కోడలు కుటుంబ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది.