Karnataka : బ్యాగ్ తీసుకొని కర్ణాటక వెళ్లిపోండి బ్రో.. ఎందుకంటే?
Karnataka : మీరు అనేక హిల్ స్టేషన్లను ఎంజాయ్ చేయవచ్చు. వాటి అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. కర్ణాటక ప్రకృతి ఒడిలో ఉంది. ఇక్కడ పర్యాటకులు సముద్రం, పర్వతాలు, పచ్చదనం నుంచి ప్రతిదీ చూడవచ్చు.

Karnataka : వేసవి వస్తుందంటే చాలు ప్రజలు పర్వతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. చాలా మంది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ జనాలు కూడా వెళ్తారు. వీటన్నిటికీ భిన్నంగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఒకసారి కర్ణాటకకు వెళ్లాల్సిందే. ఇక్కడ మీరు అనేక హిల్ స్టేషన్లను ఎంజాయ్ చేయవచ్చు. వాటి అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. కర్ణాటక ప్రకృతి ఒడిలో ఉంది. ఇక్కడ పర్యాటకులు సముద్రం, పర్వతాలు, పచ్చదనం నుంచి ప్రతిదీ చూడవచ్చు.
కర్ణాటకలోని హిల్ స్టేషన్ల గురించి మాట్లాడేటప్పుడు, ముందుగా గుర్తుకు వచ్చే పేరు కూర్గ్. ఈ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఆ తర్వాత రో సూపర్ హిల్ స్టేషన్ గురించి చెప్పాలంటే అద చిక్కమగళూరు. ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, దట్టమైన పచ్చని లోయలు వేసవిలో సందర్శించడానికి సరైన గమ్యస్థానంగా మారుస్తాయి. చిక్కమగళూరును ‘కర్ణాటక కాఫీ భూమి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజు మనం ఈ వ్యాసంలో చిక్కమగళూరు గురించి పూర్తిగా తెలుసుకుందాం.
చిక్కమగళూరు ఎందుకు ప్రత్యేకమైనది?
చిక్కమగళూరు సముద్ర మట్టానికి దాదాపు 3,400 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ వాతావరణం ఏడాది పొడవునా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు మాత్రమే కాకుండా సాహస ప్రియులకు కూడా సరైనది. ఇక్కడ మీరు ట్రెక్కింగ్, క్యాంపింగ్, వన్యప్రాణుల సఫారీని ఆస్వాదించవచ్చు.
చిక్కమగళూరులో సందర్శించాల్సిన ప్రదేశాలు
ముల్లయనగిరి పర్వతం
చిక్కమగళూరులోని ముల్లాయనగిరి పర్వతాలకు ట్రెక్కింగ్ చేయడం ఒక ఉత్తేజకరమైన అనుభవంగా ఉంటుంది. ఈ పర్వతం సముద్ర మట్టానికి దాదాపు 1930 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి నుంచి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాల అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. వేసవిలో కూడా ఇక్కడ చల్లని గాలి వీస్తుంది. ఇది మీకు విశ్రాంతినిస్తుంది.
బాబా బుడంగిరి కొండలు
బాబా బుడాన్ గిరి అనేది చిక్కమగళూరులో ఉన్న ఒక మతపరమైన ప్రదేశం. ఇది చరిత్ర, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం కొండలు, కాఫీ తోటలు, దట్టమైన అడవులతో చుట్టుముట్టబడి ఉంది. ఇక్కడ ఉన్న దత్తాత్రేయ పీఠం, బాబా బుడాన్ దర్గా హిందూ, ముస్లిం వర్గాలకు విశ్వాస కేంద్రాలు. భారతదేశానికి కాఫీని తీసుకువచ్చిన బాబా బుడాన్ అనే సూఫీ సన్యాసితో ఈ ప్రదేశం ముడిపడి ఉంది.
హెబ్బే జలపాతం
మీరు ప్రకృతి ప్రేమికులైతే హెబ్బే జలపాతాలను తప్పక సందర్శించాలి. ఈ జలపాతం చిక్కమగళూరు లోని పచ్చని అడవుల మధ్య ఉంది. ఇక్కడి నీరు ఔషధ గుణాలతో నిండి ఉందని భావిస్తారు. ఈ జలపాతం రెండు భాగాలుగా విభజించబడింది. ఇక్కడికి చేరుకోవడానికి మీరు కొంచెం నడవాల్సి రావచ్చు.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
-
Success Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. అంబానీ కంటే ధనవంతులు మీరే