Movies: మైత్రి మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపిన ఇళయరాజా
టాలీవుడ్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైనా మైత్రీ మూవీ మేకర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ బ్యానర్స్‌కి ఇళయరాజా నోటీసులు పంపారు. ఈ బ్యానర్‌లో ఏ సినిమా వచ్చినా కూడా పక్కా హిట్ అనే టాక్ ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ బ్యానర్‌పై వచ్చిన చాలా సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇ

Movies: టాలీవుడ్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైనా మైత్రీ మూవీ మేకర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ బ్యానర్స్‌కి ఇళయరాజా నోటీసులు పంపారు. ఈ బ్యానర్‌లో ఏ సినిమా వచ్చినా కూడా పక్కా హిట్ అనే టాక్ ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ బ్యానర్‌పై వచ్చిన చాలా సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇటీవల అజిత్ నటించిన గుడ్ అండ్ బ్యాడ్ అగ్లీ మూవీ కూడా ఈ బ్యానర్‌లోనే వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించగా.. త్రిష హీరోయిన్‌గా కనిపించింది. అయితే ఈ సినిమాలో మొత్తం మూడు పాటలను తన అనుమతి లేకుండా రీమేక్ చేశారని ఇళయరాజా రూ.5 కోట్లు నష్టపరిహారం కోరుతూ నోటీసులు పంపారు. ఈ పాటలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పర్మిషన్ లేకుండా తన స్వరాలను తీసుకోవడం ఏంటని ఇళయరాజా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
Read Also: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక?
ఇదిలా ఉండగా తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అజిత్ నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ఏప్రిల్ 10వ తేదీన విడుదలైంది. ఈ సినిమా అదిక రవిచంద్రన్ దర్శకత్వంలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. నాలుగో రోజైన ఆదివారం అయితే సుమారుగా రూ.37 కోట్ల కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్‌ను హిట్ కొట్టేలా చేసింది. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి ఫస్ట్ డే సుమారుగా రూ.57 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఆ తర్వాత డ్రాప్ అయి రెండో రోజు సుమారు రూ.28 కోట్లు దక్కాయి. ప్రేమ పుస్తకం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అజిత్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మే నెలలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెడ్ డ్రాగన్ అనే మాజీ గ్యాంగ్‍స్టర్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ కుమార్ నటించారు. అయితే ఇందులో అజిత్ కొడుకు కిడ్నాప్ అవుతాడు. అప్పుడు మళ్లీ అజిత్ మళ్లీ గ్యాంగ్‍స్టర్‌గా మారతాడు. ఇదే మూవీ మొత్తం స్టోరీ ఉంటుంది. ఈ మూవీలో చాలా మంది కీలక పాత్రలు పోషించారు. ప్రతీప్ కాబ్రా, హ్యారీ జోష్, కేజీఎఫ్ అవినాశ్, సునీల్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, ప్రభు, రాహుల్ దేవ్, ఉషా ఉతప్, కింగ్‍స్లే, రోడీస్ రఘు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
-
Rid of Debt: అప్పుల బాధలు తీరాలంటే.. ఈ నియమాలు పాటించాల్సిందే
-
Zodiac signs: కుజుడు, శని కలయిక.. ఈ రాశుల వారికి పట్టనున్న కుభేరయోగం
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్‌పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Good news: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి
-
Zodiac Signs: అదృష్టమంటే వీరిదే భయ్యా.. ఈ రాశుల వారికి అసలు తిరుగే లేదు