Health Tips: ఉదయాన్నే ఈ టిప్స్ పాటిస్తే.. బెస్ట్ థింకర్ ఇకపై మీరే

Health Tips: ఉదయం పూట తొందరగా లేస్తేనే రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారు. లేకపోతే ఏదో ఒక సమస్యతో చిరాకుగా ఉంటుంది. అయితే మరికొందరు ఉదయాన్నే నిద్ర లేస్తారు. కానీ బద్దకంగా ఉంటారు. లేచి గంటల తరబడి బెడ్ దగ్గర కూర్చోని ఉంటారు. ఇలా చేయడం వల్ల నిద్ర పోదు.. కానీ బద్దకం పెరుగుతుంది. ఈ బద్దకం వల్ల రోజులో ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. చిరాకుగా ఉండటం, ఏ పని చేయడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతీ విషయంలో కూడా ఏదో ఆలస్యంగానే అవుతుంది. అయితే మీరు ఉదయాన్నే కొన్ని టిప్స్ పాటిస్తే తప్పకుండా రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారు. అయితే రోజంతా ఎలాంటి చిరాకు లేకుండా, యాక్టివ్‌గా ఉండేందుకు పాటించాల్సిన చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
పది నిమిషాల పాటు
నిజానికి ఈ రోజుల్లో చాలామంది లేచిన వెంటనే మొబైల్ వాడుతారు. ఒక గంట సమయం యూజ్ చేసిన తర్వాత ఏదైనా చేస్తారు. ఉదయాన్నే మొబైల్ చూడటం వల్ల మీలో నెగిటివిటీ పెరుగుతుంది. ఎందుకంటే లేచిన వెంటనే ఏం చేయకుండా ఒక పది నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఇలా చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఏ పని అయినా కూడా సరిగ్గా జరుగుతుంది. ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు.
హైడ్రేషన్
ఉదయం లేచిన వెంటనే బెడ్ కాఫీ, టీ వంటివి కాకుండా వాటర్‌తో డేని స్టార్ట్ చేయడం మంచిది. లేదా నిమ్మరసం తాగడం వల్ల మీ బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. నిమ్మరసంలోని పోషకాలు మీకు శక్తని కూడా ఇస్తుంది. రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. మీలో ఆలోచన మారుతుంది. రోజూ ఇలా చేస్తే బెస్ట్ థింకర్ మీరే అవుతారు.
సూర్యకాంతి
ఉదయం సూర్యరశ్మి మనిషిని శారీరకంగా, మానసికంగా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. సూర్యరశ్మిలో ఒక పది నిమిషాలు అయినా ఉండటం వల్ల మీ శరీరంలో డోపమైన రిలీజ్ అవుతుంది. ఇది మీ డేను అందంగా మార్చడంలో బాగా ఉపయోగపడుతుంది.
వ్యాయామం
ఉదయం పూట వ్యాయామం మైండ్ తీరును మెరుగుపరుస్తుంది. మీరు బాగా ఆలోచించగలరు. రోజుకి ఒక పది నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రతీ విషయంలో ఉంటారు. అలాగే బ్రెయిన్‌కి కూడా యాక్టివ్ అనిపిస్తుంది. ఎందుకంటే వ్యాయామం మీ ఆలోచన తీరును మార్చుతుంది.
చల్లటి నీటి స్నానం
ఉదయాన్నే చల్లని నీరు స్నానం చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది. మీ మైండ్, బాడీ రెండు కూడా రిఫ్రెష్ అవుతాయి. ఉదయాన్నే స్నానం చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. లేకపోతే చిరాకుగా, బద్దకంగా ఉంటుంది. ఇలా ఒక్క రోజు కాకుండా కొన్ని రోజులు పాటు ఈ టిప్స్ పాటిస్తే మీలో మార్పులు చాలా చూస్తారు.
-
Summer Health Tips: వేసవిలో వీటిని తీసుకోండి శరీరం చల్లగా ఉంటుంది.
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Laptop : లాప్ టాప్ ముందు కూర్చొని కూర్చొని భుజం నొప్పి వస్తుందా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Summer: వేసవిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోండిలా!