Toothbrush Brush: బ్రష్ ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలంటే?
Toothbrush Brush శరీర ఆరోగ్యంతో పాటు దంతాల ఆరోగ్యం కూడా ముఖ్యమైనవి. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోకపోతే దంత సమస్యలు వస్తాయి. చాలా మంది సరిగ్గా బ్రష్ చేయరు. ఒకే బ్రష్‌ను ఏళ్ల తరబడి వాడుతుంటారు.

Toothbrush Brush: ఉదయం లేచిన వెంటనే చాలా మంది బ్రష్ చేస్తారు. కొందరు బ్రష్ చేయకుండా తినేస్తారు. కానీ మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండా అసలు ఏ పని కూడా చేయరు. ఉదయాన్నే బ్రష్ చేయడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుంది. బ్రష్ చేయకుండా ఏదైనా తింటే మాత్రం బ్యాక్టీరియా ఉండిపోతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు బాగా స్మెల్ వస్తుంది. అయితే పూర్వ కాలంలో వేప పుల్లలతో బ్రష్ చేసేవారు. ప్రస్తుతం అయితే చాలా మంది వీటి గురించి పెద్దగా తెలియదు. అయితే కొందరికి బ్రష్ కొనడానికి సమయం లేకపోవడం వల్ల ఎక్కువ రోజులు ఒకే బ్రష్ వాడుతారు. ఒకే బ్రష్‌ను ఎక్కువ రోజులు ఇలా వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు ఒకే బ్రష్ వాడటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఎన్ని రోజులకు ఒకసారి బ్రష్‌లు మారుస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
శరీర ఆరోగ్యంతో పాటు దంతాల ఆరోగ్యం కూడా ముఖ్యమైనవి. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోకపోతే దంత సమస్యలు వస్తాయి. చాలా మంది సరిగ్గా బ్రష్ చేయరు. ఒకే బ్రష్‌ను ఏళ్ల తరబడి వాడుతుంటారు. ఇలాంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఒకే బ్రష్‌ను ఎక్కువ రోజులు వాడకూడదు. ఎందుకంటే బ్రష్‌ను రోజూ చేస్తు్ంటాం. ఆ తర్వాత ఇందులో బ్యాక్టీరియా, ఫంగస్ చేరుతాయి. వీటివల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయి. జలుబు, దగ్గు, నోటి పుండ్లు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పళ్ల చిగుళ్లు కూడా బాగా దెబ్బతింటుంది. కాబట్టి బాగా పాడైన బ్రష్‌ను వాడవద్దు. బ్రష్‌ను కేవలం రెండు నెలలు మాత్రమే వాడాలి. ప్రతీ రెండు లేదా మూడు నెలలకు బ్రష్ మారుస్తుండాలి. అప్పుడే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. బ్రష్‌లు అరిగే వరకు వాటిని అసలు వాడవద్దు. వాటి పాలిష్‌లు కాస్త పాత అయిన వెంటనే వాటిని పడేయండి. లేదు అని అదే బ్రష్ కంటిన్యూగా వాడితే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఎలక్ట్రిక్ బ్రష్‌లు వాడుతుంటారు. వీటిని కూడా ఎక్కువగా వాడకూడదు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి ఈ బ్రష్‌లను మార్చాలని నిపుణులు చెబుతున్నారు.
బాగా పాడైన బ్రష్ వాడితే వాటి రూట్స్ పళ్లన దెబ్బతీస్తాయి. కొన్నిసార్లు చిగుళ్లులో రక్తం, చీము వస్తుంది. దీనివల్ల మీరు ఎలాంటి ఆహారం కూడా తీసుకోలేరు. పంటి నొప్పి వస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయి ఇబ్బంది పడతారు. ఒక్కసారి పంటి సమస్యలు వస్తే మాత్రం వాటిని తగ్గించడం చాలా కష్టం. కనీసం ఫుడ్ కూడా తీసుకోలేరు. ఎల్లప్పుడూ కూడా నొప్పితో ఇబ్బంది పడతారు. కాబట్టి ఎక్కువ రోజులు ఒకే బ్రష్‌ను వాడవద్దు. ఎప్పటికప్పుడు బ్రష్‌ను మారుస్తూ ఉండాలి.