Hair Health: ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జుట్టు రాలడాన్ని ఆపడం కష్టమే..

Hair Health: చాలా మందిలో జుట్టు రాలడం ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. పురుషులు అయినా, స్త్రీలు అయినా చిన్న పిల్లలు అయినా సరే అందరు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. కానీ నివారణ మార్గాలు ఉపయోగించినా సరే ప్రయోజనం ఉండటం లేదు. ఈ సమస్యతో బాధపడే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఎలాంటి ఉత్పత్తులను వినియోగించినా సరే పెద్దగా పని చేయడం లేదు. అందుకే ముందుగా మీరు జుట్టు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జుట్టు ఎందుకు రాలిపోతుందో మీకు ఎలాంటి సమస్య ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన పరిష్కారాన్ని కనుగొనాలి అంటున్నారు నిపుణులు.
అనారోగ్యకరమైన ఆహారం- పోషకాహార లోపాలు: జుట్టు ఆరోగ్యం మీ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారం వల్ల జుట్టు నిగారింపు కూడా సంతరించుకుంటుంది. అయితే మీ ఆహారంలో ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ డి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉండాలి. లేదంటే మాత్రం జుట్టు రాలడాన్ని ఆపడం కష్టం అవుతుంది. జుట్టుకు అవసరమైన పోషకాలు కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే జుట్టు బలహీనంగా మారుతుంది. బండికి పెట్రోల్ ఎంత అవసరమో.. మీ జుట్టుకు పోషకాలు కూడా అంతే అవసరం లేదంటే సమస్యల బారిన పడుతాయి మీ అందమైన శిరోజాలు. మరీ ముఖ్యంగా జుట్టు రాలుతుంది. జుట్టుకు లోపలి నుంచి పోషణ అందితే మీరు బయట ఉపయోగించే ఉత్పత్తులు సరిగ్గా పని చేస్తాయి అంటున్నారు నిపుణులు.
ఒత్తిడి – మానసిక ఆరోగ్యం: జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణం. మీరు ఒత్తిడికి గురైనప్పుడు, శరీరంలో కార్టిసోల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను నివారిస్తుంది. సో జుట్టు ఊడుతుంది. ఒత్తిడి వల్ల జుట్టు రాలి పోతే బయట చికిత్సలు అసలు పని చేయవు. అందుకే మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలి. దీని కోసం యోగా, ధ్యానం, తగినంత నిద్ర అవసరం.
హార్మోన్ల అసమతుల్యత: జుట్టు రాలడానికి హార్మోన్ల అసమతుల్యత కూడా ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. థైరాయిడ్ సమస్యలు, PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) లేదా మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు జుట్టు రాలడానికి కారణమవుతాయి.అందుకే వైద్యుడిని సంప్రదించి హార్మోన్ల సమస్యకు చికిత్స పొందడం చాలా ముఖ్యం.
జుట్టు సంరక్షణ ఉత్పత్తులు: మార్కెట్లో లభించే అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తులు అధిక మొత్తంలో రసాయనాలు ఉంటాయి, ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి. సల్ఫేట్లు, పారాబెన్, సిలికాన్ వంటి రసాయనాలు జుట్టును బలహీన పరుస్తాయి. జుట్టు రాలడాన్ని పెంచుతాయి. ఇక రసాయనాలతో నిండిన షాంపూ, కండిషనర్ లేదా హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించడం కూడా జుట్టుకు హానికరమే అంటున్నారు నిపుణులు. మీ జుట్టు రకాన్ని బట్టి సరైన ఉత్పత్తిని ఎంచుకోవాలి.
రాత్రి పడుకునే సమయంలో జుట్టును టైట్ గా వేసుకోవద్దు. కాస్త లూజ్ గా ఉంచాలి. ఇక తడి వెంట్రుకలను దూయడం మానుకోవాలి. జుట్టును ఎప్పుడు వదిలి వేసి ఉండటం కంటే జుట్టు వేసుకోవడం బెటర్. లేదంటే జుట్టు రాలుతూనే ఉంటుంది. ఇక మంచి సీరం ను వాడటం కూడా అలవాటు చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Hair: జుట్టు నివారణ చర్యలు కాదు.. జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం ముఖ్యం
-
Hair Health Tips: పదే పదే గుండు చేయిస్తే వెంట్రుకలు మందంగా వస్తాయా?
-
Rosemary Oil: తలకు రోజ్‌మెరీ ఆయిల్ అప్లై చేయవచ్చా? చేస్తే జుట్టు పెరుగుతుందా?
-
Hair Health Tips: నీరు మారితే జుట్టు ఊడిపోతుందా? మరి చుట్టాల ఇంటికి, స్విమ్మింగ్ ఫూల్ కు వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి?
-
Hair: చికెన్‌కి, జుట్టుకి లింక్ ఏంటి.. దీనివల్ల జుట్టు పెరుగుతుందా.. ఇందులో నిజమెంత?
-
Hair Health: మీ జుట్టు బూడిద రంగులోకి మారిందా? వీటిని తింటే అసలు రంగే మారదు.