Hair: చికెన్‌కి, జుట్టుకి లింక్ ఏంటి.. దీనివల్ల జుట్టు పెరుగుతుందా.. ఇందులో నిజమెంత?

Hair:
మనలో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. రోజూ చికెన్ పెట్టినా తినేస్తారు. మూడు పూటలు కూడా చికెన్ తినాలని అనుకుంటారు. అయితే ప్రస్తుతం చికెన్ తినే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంట్లో ఏ చిన్న స్పెషల్ జరిగినా కూడా చికెన్ తింటున్నారు. చికెన్‌ను ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని కొందరు అంటున్నారు. అలాగే ఇది ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చికెన్‌లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి బలాన్ని ఇస్తుంది. అయితే ఆరోగ్యానికి ఎంత మంచి అయినా కూడా లిమిట్‌లోనే తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే చికెన్‌ను కూడా లిమిట్‌లోనే తీసుకుంటే జట్టు బలంగా పెరుగుతుందని కొందరు అంటున్నారు. ఇందులోని ప్రొటీన్ జుట్టు బలంగా పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలిపోకుండా కూడా చేస్తుంది. జుట్టు రాలే సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయి. చికెన్‌లోని ప్రొటీన్ బాడీని బలంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మం కూడా ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. చికెన్ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జట్టు ఎక్కువగా రాలిపోతుందని అనుకునే వారు చికెన్‌ను వారంలో తినడం వల్ల తప్పకుండా ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చికెన్‌లో ప్రొటీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ బాడీలో చెడు కొవ్వును ఎక్కువగా పెంచుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కోళ్లు తొందరగా పెరగాలని వాటికి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. వీటివల్ల కోళ్లు తొందరగా ఏపుగా పెరుగుతాయి. దీంతో మనుషుల్లో కూడా కొవ్వు బాగా పెరుగుతుంది. బాయిలర్ చికెన్ కంటే నాటుకోడిని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. జుట్టు బలంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నాటు కోడిలో ఎలాంటి రసాయనాలు, కెమికల్స్ ఉండవు. ఇవి జుట్టుని ఆరోగ్యంగా పెంచడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కూడా బలంగా పెంచుతాయి. దీంతో అన్ని విధాలుగా కూడా పెరుగుతుంది. నాటు కోడి వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని కూడా బాగా అందుతాయి. అయితే బాయిలర్ చికెన్‌లో బ్రెస్ట్ పీస్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీర ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. దీనివల్ల ఇంకా శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే చికెన్‌ను స్టీమ్ లేదా గ్రిల్ చేసి తినడం వల్ల ఇంకా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే మంచిదని ఎక్కువగా తినకూడదు. తింటే అనారోగ్య బారిన పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వాటిలోని కొవ్వు శరీర అనారోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఎంత ప్రొటీన్ ఉన్నా కూడా కాస్త లిమిట్‌లో మాత్రమే చికెన్‌ను తినడం అలవాటు చేసుకోండి.
-
Hair: జుట్టు నివారణ చర్యలు కాదు.. జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం ముఖ్యం
-
Hair: జుట్టు పెరగాలంటే ఇది ఒక్కటి రాస్తే చాలు
-
Hair Health Tips: పదే పదే గుండు చేయిస్తే వెంట్రుకలు మందంగా వస్తాయా?
-
Rosemary Oil: తలకు రోజ్మెరీ ఆయిల్ అప్లై చేయవచ్చా? చేస్తే జుట్టు పెరుగుతుందా?
-
Hair Health Tips: నీరు మారితే జుట్టు ఊడిపోతుందా? మరి చుట్టాల ఇంటికి, స్విమ్మింగ్ ఫూల్ కు వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి?
-
Hair Health: మీ జుట్టు బూడిద రంగులోకి మారిందా? వీటిని తింటే అసలు రంగే మారదు.