Gold: బంగారం కొనుగోలు చేయడానికి పర్సనల్ ఇస్తారా? ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది?

Gold:
ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో (India) బంగారానికి (Gold) బాగా డిమాండ్ ఉంది. మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఏదైనా చిన్న ఫంక్షన్ (Function) ఉందంటే చాలు.. ఇక బంగారంతో నిండిపోతారు. అయితే రోజురోజుకీ బంగారం (Gold) ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో చాలా మంది ముందుగానే బంగారం (Gold) కొని ఉంచుకుంటున్నారు. అయితే చాలా మంది దగ్గర బంగారం కొనేంత డబ్బు ఉండదు. దీంతో అప్పులు తీసుకుంటారు. కానీ వీటికి వడ్డీలు (Interest) కట్టలేరు. అయితే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకుంటున్నారు. బంగారం కొనడానికి పర్సనల్ లోన్ తీసుకోవచ్చా? తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పర్సనల్ లోన్స్ అనేవి ఇల్లు, ఆస్తులు ఇలా కొనడానికి మాత్రమే ఇస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ బంగారం కొనడానికి కూడా పర్సనల్ లోన్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకుని, దాంతో బంగారం కొనవచ్చు. అయితే బ్యాంకులు కేవలం అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ లోన్లు ఇస్తాయి. అయితే వీటికి ఎలాంటి తాకట్టు కూడా పెట్టక్కర్లేదు. మీ బ్యాంకు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ వర్తీనెస్ ప్రకారం ఇస్తాయి. మీరు ఎంత లోన్‌కి అర్హులు అయితే అంత వరకు మాత్రమే ఇస్తుంది. అయితే వీటిపై వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకుని ఆలస్యంగా పే చేస్తే మాత్రం వడ్డీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. టైమ్ ప్రకారం డబ్బులు కడితే మీకు తక్కువ వడ్డీ మళ్లీ భవిష్యత్తులో లభిస్తుంది.
ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి బంగారం కొనడానికి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. బంగారం ధరలు తగ్గితే నష్టం. కానీ పెరుగుతున్నాయి. కాబట్టి ఎలాంటి సమస్య లేదు. మీరు లోన్ తీసుకుని దాంతో బంగారం కొని.. సరైన సమయానికి ఆ లోన్‌ను ఈజీగా క్లియర్ చేయవచ్చు. రోజురోజుకీ బంగారం పెరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ బంగారం ధరలు సడెన్‌గా పడిపోతే మాత్రం.. మీకు నష్టం వస్తుంది. నిజానికి బంగారం ధరలు తగ్గే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకీ ధరలు భారీగానే పెరుగుతాయి. కానీ అసలు తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతం తులం బంగారం లక్ష దాటింది. మున్ముందు బంగారం ధరలు ఎంత పెరుగుతాయో మరి చూడాలి.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Gold: ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందంటే?
-
Gold prices : కొండెక్కుతున్న పసిడి ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో గోల్డ్
-
Gold: వాడకుండా ఉంటే బంగారం పోతుందా?
-
Vastu Tips: వారంలో ఏ రోజు బంగారం కొనడానికి మంచిదో మీకు తెలుసా?
-
Tips:పాత బంగారు నగలు కొత్తగా మెరవాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి