First Ultra Sound : గర్భధారణ సమయంలో మొదటి అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేయాలి?
First Ultra Sound: చాలా మంది వైద్యులు మొదటి అల్ట్రాసౌండ్ చేయడానికి దాదాపు 6-8 వారాల వరకు వెయిట్ చేస్తారు. తద్వారా పిండం సరిగ్గా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా అంచనా వేయవచ్చు అని ఈ సమయంలోనే స్కాన్ చేస్తారు.

First Ultra Sound : గర్భధారణ సమయంలో మొదటి అల్ట్రాసౌండ్ను ప్రైమరీ స్కాన్ అంటారు. గర్భధారణను నిర్ధారించడానికి, ప్రసవ తేదీని నిర్ణయించడానికి, పిండం హృదయ స్పందనను తెలుసుకోవడానికి సాధారణంగా మొదటి స్కాన్ చాలా అవసరం అవుతుంది. ఇది గర్భధారణ 7, 8 వారాల మధ్య చేస్తారు. అయితే అల్ట్రాసౌండ్ ముందుగానే చేయవచ్చు. చాలా మంది వైద్యులు మొదటి అల్ట్రాసౌండ్ చేయడానికి దాదాపు 6-8 వారాల వరకు వెయిట్ చేస్తారు. తద్వారా పిండం సరిగ్గా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా అంచనా వేయవచ్చు అని ఈ సమయంలోనే స్కాన్ చేస్తారు.
అల్ట్రాసౌండ్ గర్భం నిజంగానే ఉందా? లేదా? కంటిన్యూ చేయవచ్చా? లేదా అనే అంశాల గురించి క్లారిటీ ఇస్తుంది. శిశువు పరిమాణాన్ని (తల నుండి కాలి వరకు పొడవు) తెలుసుకోవచ్చు. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ ఖచ్చితమైన అంచనా వేసి పుట్టిన తేదీని నిర్ణయించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా స్త్రీ ఋతు చక్రం కొన్ని సార్లు సరిగ్గా సమయానికి రాదు. ఇలాంటప్పుడు స్కాన్ చాలా ఉపయోగపడుతుంది.
అల్ట్రాసౌండ్ వల్ల పిండం హృదయ స్పందన ఉనికిని చూసి తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ లో గర్భంలో ఒక శిశువు ఉన్నారా? ఇద్దరా అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అల్ట్రాసౌండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల గర్భం) లేదా గర్భస్రావం వంటి సమస్యల సంకేతాలను గుర్తించడంలో సహాయపడుతుంది. అయితే ట్రాన్స్వాజినల్ అల్ట్రాసౌండ్ ను ఎక్కువగా గర్భధారణ ప్రారంభ దశలలో మెరుగైన ఫలితాలను తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారు. ట్రాన్సాబ్డోమినల్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ను గర్భధారణ చివరి దశలలో చేస్తారు. ఇక్కడ పిండాన్ని చూడటం సులభం అవుతుంది.
గర్భధారణ సమయంలో చేసే మొదటి అల్ట్రాసౌండ్ చాలా ముఖ్యమైనది. సాధారణంగా వైద్యులు గర్భం దాల్చిన 6 నుంచి 8 వారాల తర్వాత మొదటి అల్ట్రాసౌండ్ చేయించుకోవాలని సిఫార్సు చేస్తారు. ఈ అల్ట్రాసౌండ్ ముఖ్య ఉద్దేశ్యం ఫెలోపియన్ ట్యూబ్, పిండం స్థితిని తెలియజేస్తుంది. ఇది ఫెలోపియన్ ట్యూబ్ సరైన స్థానంలో ఉందా లేదా? పిండం సరిగ్గా అభివృద్ధి చెందుతోందా లేదా? పిండం హృదయ స్పందన సాధారణంగా ఉందా లేదా మొదలైన వాటిని తెలియజేస్తుంది. ఏదైనా సమస్య ఉంటే, ఈ అల్ట్రాసౌండ్ ద్వారా దానిని గుర్తించి సరైన చికిత్స అందించవచ్చు. అందువల్ల, గర్భం మొదటి త్రైమాసికంలో అల్ట్రాసౌండ్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
అల్ట్రాసౌండ్ అనేది శిశువు చిత్రాలను రూపొందించడానికి ధ్వని తరంగాలను ఉపయోగించే సురక్షితమైన, నొప్పిలేకుండా చేసే ప్రక్రియ. శిశువు అవయవాల అభివృద్ధిని అంచనా వేయడానికి చాలా మంది మహిళలు 18, 22 వారాల మధ్య రెండవ అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకుంటారు. దీన్ని “మార్ఫాలజీ స్కాన్” లేదా “అనాటమికల్ స్కాన్” అని పిలుస్తారు. శిశువు పరిస్థితి, మొత్తం అభివృద్ధిని తెలుసుకోవడానికి మూడవ త్రైమాసికంలో 32, 36 వారాల మధ్య అల్ట్రాసౌండ్ చేయవచ్చు.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Exercises: ఆఫీస్ లో కూర్చొనే ఈ వ్యాయామాలు చేయండి.
-
Health Tips : రోజుకు ఒకసారి అన్నం తింటే శరీరంలో ఈ మార్పులు పక్కా..
-
Health Tips : వీరు ఎండు చేపలు తింటే.. అంతే సంగతులు
-
Weight Gain Tips: వీక్ గా ఉంటున్నారా? గుర్రంలా పరుగెత్తించేలా చేస్తాయి ఇవి.