Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
Health Tips ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), సెలియాక్ వ్యాధి లేదా క్రోన్'స్ వ్యాధి వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు మీకు ఆకలి లేకపోవడానికి కారణమవుతాయి. మీకు ఆకలిగా అనిపించకపోతే మీరు ఈ సమస్యలతో పోరాడుతున్నారని అర్థం.

Health Tips: మీరు రోజంతా ఏమీ తినకపోయినా ఆకలిగా అనిపించకపోతే, దీనికి అనేక కారణాలు ఉంటాయి. చాలా మంది రోజంతా ఏమీ తినకపోవడం కామన్ గా కనిపిస్తుంటుంది. అయినా సరే వారికి మాత్రం అసలు ఆకలి వేయదు అంటారు. ఇది మాత్రం అసలు కామన్ కాదండోయ్. రోజు మొత్తం తినకపోయినా సరే ఆకలి కావడం లేదు అంటే అది మామూలు విషయమా చెప్పండి? అంతే కాదు చాలా సార్లు వారు ఉదయం నుంచి కూడా ఏమీ తినరు. అలాంటి వారికి సాయంత్రం అయినా సరే అసలు ఆకలిగా అనిపించదట. ఇది సాధారణ సమస్య కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. అందుకే ఆకలి లేకపోవడానికి సాధారణ కారణాలు ఏంటో తెలుసుకుందాం.
1. కడుపు సమస్యలు
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), సెలియాక్ వ్యాధి లేదా క్రోన్’స్ వ్యాధి వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు మీకు ఆకలి లేకపోవడానికి కారణమవుతాయి. మీకు ఆకలిగా అనిపించకపోతే మీరు ఈ సమస్యలతో పోరాడుతున్నారని అర్థం. అటువంటి పరిస్థితిలో, మీరు మొదట మీ రక్త పరీక్ష చేయించుకోవాలి. దాని తర్వాత సరైన మందులు లేదా డాక్టర్ సలహాలు సూచనలు పాటించడం వల్ల ఆకలి సమస్య తీరుతుంది.
2. హార్మోన్ల అసమతుల్యత
కొన్నిసార్లు, హార్మోన్ల అసమతుల్యత కారణంగా, కొందరికి అస్సలు ఆకలి వేయదు. మీరు రోజంతా ఆకలితో ఉన్నా సరే మీకు ఆహారం తినాలి అనిపించదు. హార్మోన్ల అసమతుల్యత హైపోథైరాయిడిజం, హైపోగ్లైసీమియా లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కూడా దారితీయవచ్చు. దీని వలన మీకు ఆకలి తగ్గుతుంది.
3. ఒత్తిడి – ఆందోళన
ఒత్తిడి, ఆందోళన మీ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మీ ఆకలిని తగ్గిస్తాయి. అందుకే ఏదో ఒకటి గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ, ఆందోళన చెందుతూ ఉంటారు. ఇది మీ ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల కూడా ఆకలిగా అనిపించదు. సో ఒత్తిడి, ఆందోళన తగ్గేలా యోగా చేయండి.
4. మందులు
యాంటిడిప్రెసెంట్స్, యాంటిహిస్టామైన్లు, స్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులు మీకు ఆకలిని కోల్పోయేలా చేస్తాయి. ఒక వ్యక్తి ఇతర వ్యాధులతో బాధ పడుతుంటే ఇతర మందలు వేసుకోవాల్సి వస్తుంది. ఈ మందుల వల్ల చాలా సార్లు ఆకలి తగ్గుతుంది కూడా.
5. సరైన దినచర్య
మీరు సరైన దినచర్యను పాటించకపోయినా చాలా సార్లు మీకు ఆకలిగా అనిపించదు. అదనంగా, క్యాన్సర్, ఎయిడ్స్ లేదా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యలు మీకు ఆకలిని తగ్గిస్తాయి. మీకు రోజంతా ఆకలిగా అనిపించకపోతే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. మీ వైద్యుడు కారణాన్ని గుర్తించడంలో, సరైన చికిత్సను అందించడంలో మీకు సహాయం చేయగలడు అని మర్చిపోవద్దు.
Disclaimer : ఈ ఆర్టికల్ లో పేర్కొన్న సలహాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించాము. వీటిని వృత్తిపరమైన వైద్య సలహాగా భావించకూడదు. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించండి. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Black Salt: నల్ల ఉప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Exercises: ఆఫీస్ లో కూర్చొనే ఈ వ్యాయామాలు చేయండి.
-
First Ultra Sound : గర్భధారణ సమయంలో మొదటి అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేయాలి?
-
Health Tips : రోజుకు ఒకసారి అన్నం తింటే శరీరంలో ఈ మార్పులు పక్కా..
-
Health Tips : వీరు ఎండు చేపలు తింటే.. అంతే సంగతులు