North America: ఉత్తర అమెరికాలో భూగర్భ చినుకులు ఎందుకు వస్తున్నాయో తెలుసా?
ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. మిడ్‌వెస్ట్ కింద లోతుగా భూమిలో చినుకులు ఉన్నాయి. భూకంప ఇమేజింగ్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు మధ్య అమెరికా కింద భారీ, బిందువు వంటి నిర్మాణాలను గుర్తించారు.

North America: ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. మిడ్‌వెస్ట్ కింద లోతుగా భూమిలో చినుకులు ఉన్నాయి. భూకంప ఇమేజింగ్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు మధ్య అమెరికా కింద భారీ, బిందువు వంటి నిర్మాణాలను గుర్తించారు. ఖండం పురాతన కోర్ లేదా క్రాటాన్ బేస్ నుంచి పదార్థాలు మాంటిల్ ట్రాన్సిషన్ జోన్‌లోకి మునిగిపోయాయి. అయితే ఉత్తర అమెరికా అడుగున భూగర్భంలో భారీ చుక్కలు ఉన్నాయి. అయితే ఇవి పెద్ద ఎత్తున మాంటిల్ ప్రవాహం వల్ల సంభవిస్తాయని జియో డైనమిక్ నమూనాలు చెబుతున్నాయి. ఇప్పుడు దిగువ మాంటిల్‌లో లోతుగా ఉన్న లాంగ్-సబ్డక్ట్డ్ ఫారల్లాన్ స్లాబ్‌లో ఉన్నాయి. ఈ పురాతన స్లాబ్ పైనున్న లిథోస్పియర్‌ను బలహీన పరుస్తోంది. దీనివల్ల మాంటిల్‌లోకి చినుకులు పడే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు.
Read Also: ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
ఈ బిందు వంటి నిర్మాణాలు భూగర్భంలో దాదాపు 640 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉన్నాయి. మిచిగాన్, నెబ్రాస్కా, అలబామాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఈ బిందువుల ఏర్పాటును ఫారల్లాన్ ప్లేట్‌తో అనుసంధానించారు. ఈ భూగర్భ చుక్కలు చురుకైన సముద్రపు ప్లేట్. అయితే ఇది ప్రస్తుతం ఉత్తర అమెరికా కింద మునిగిపోయింది. అయితే ఇది సుమారుగా 20 మిలియన్ సంవత్సరాల క్రితం విరిగిపోయింది. మిగిలిపోయిన స్లాబ్‌లు మాంటిల్‌లోకి దిగడంతో ఆటోమేటిక్‌గా ముక్కలుగా కొనసాగించాయి. ఈ మిడ్‌వెస్ట్ కింద ఒక పెద్ద గరాటు ఆకారపు మండలం ఉంది. ఇది ఉత్తర అమెరికా అంతటా ఉన్న రాళ్లను భూమి మాంటిల్‌లోకి మునిగిపోయే ముందు అడ్డంగా తన వైపుకు లాగుతోందని పరిశోధకులు చెబుతున్నారు.
పురాతన టెక్టోనిక్ ప్లేట్ భాగం లోతుగా మునిగిపోయి క్రాటన్‌పై దాని ప్రభావాన్ని కోల్పోతున్నంది. ఇదంతా కూడా చాలా స్లోగా జరుగుతుంది. ఆటోమెటిక్‌గా ఇది జరిగి చివరి వరకు ఆగిపోతుందని అంటున్నారు. ఖండాల దీర్ఘకాలిక పరిణామాన్ని అన్వేషించి భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక గ్రహం ఎలా పరిణామం చెందుతుందో అనే విషయాన్ని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అసలు ఖండాలు ఎలా ఏర్పడతాయి? వాటిని ఎలా విచ్ఛిన్నం చేస్తాయి? అనే అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. కొన్ని సైంటిఫిక్ కారణాల వల్ల ఈ చుక్కలు ఏర్పడుతున్నాయి. వీటివల్ల నష్టాల కంటే ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు.