Swimming: బీపీ ఉన్నవారు వేసవిలో స్విమ్ చేయడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
Swimming అధిక రక్తపోటు అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమే. ఈ సమస్య ఉన్నవారు వేసవిలో స్విమ్మింగ్ చేయడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ చేసినా కూడా తక్కువ సమయం మాత్రమే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Swimming: మారిన జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందులోనూ వేసవిలో అయితే ఇంకా ఇబ్బంది పడుతుంటారు. బాడీ తొందరగా డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. దీనివల్ల కొందరికి రక్తపోటు కూడా పెరుగుతుంది. అయితే వేసవిలో బీపీ ఎక్కువగా ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో చాలా మంది చల్లదనం కోసం స్విమ్మింగ్ చేస్తుంటారు. ఇలా చేస్తే చాలా రిలాక్స్‌గా ఉంటుందని భావిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే స్విమ్మింగ్ చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదే. కండరాలు అన్ని కూడా బలంగా తయారు అవుతాయి. ఈత వల్ల బాడీకి వ్యాయామం కూడా అవుతుంది. అయితే ముఖ్యంగా బీపీ సమస్యలు ఉన్నవారు వేసవిలో స్విమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వీరు ఇబ్బందుల్లో పడతారని నిపుణులు చెబుతున్నారు. అయితే బీపీ ఉన్నవారు వేసవిలో స్విమ్మింగ్ చేయవచ్చా? చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
అధిక రక్తపోటు అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమే. ఈ సమస్య ఉన్నవారు వేసవిలో స్విమ్మింగ్ చేయడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ చేసినా కూడా తక్కువ సమయం మాత్రమే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒక్కసారిగా చల్లని నీరు రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల రక్తపోటు ఒక్కసారిగా పెరిగి గుండె పోటు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బాడీ డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండె సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. స్విమ్ చేస్తే అలసిపోతారు. ఎప్పుడు లేని శ్రమ ఒక్కసారిగా పెరిగితే ఒత్తిడి అధికం అవుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తీవ్రం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి బీపీ ఉన్నవారు వీలైనంత వరకు స్విమ్మింగ్ చేయకపోవడం మంచిదని చెబుతున్నారు.
బీపీ ఉన్నవారు వేసవిలో స్విమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. స్విమ్మింగ్ చేసేటప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి వాటర్ ఎక్కువగా తాగి స్విమ్మింగ్ మొదలు పెట్టండి. ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయం మాత్రమే చేయాలి. ఎప్పటికప్పుడు రక్తపోటును చెక్ చేసుకోండి. అలాగే స్విమ్మింగ్ పూల్ వాటర్ అంత మంచిగా ఉండవు. కాబట్టి మీరు నీటి నాణ్యతను చూసుకుని చేయండి. ఎక్కువగా ఒత్తిడికి గురి కావద్దు. నిజానికి స్విమ్మింగ్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బీపీ ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా చేయాలి. మిగతా వారు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.