Ice creams: సమ్మర్‌లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది ఐస్ క్రీమ్స్ తింటుంటారు. అందులోనూ పిల్లలు అయితే చెప్పక్కర్లేదు. ఎంతో ఇష్టంగా వీటిని తింటుంటారు.

Ice creams: వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది ఐస్ క్రీమ్స్ తింటుంటారు. అందులోనూ పిల్లలు అయితే చెప్పక్కర్లేదు. ఎంతో ఇష్టంగా వీటిని తింటుంటారు. రోజులో ఎన్నిసార్లు ఇచ్చినా కూడా పిల్లలు వద్దు అనకుండా తింటారు. అయితే మార్కెట్లో ఎన్నో రకాల ఐస్ క్రీమ్‌లు ఉన్నాయి. ఒక్కో ఫ్లేవర్‌తో ఐస్ క్రీమ్‌లు ఉన్నాయి. వీటిని సాధారణంగానే తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయినా కూడా కొందరు వేసవిలో చల్లదనం కోసం డైలీ తింటారు. ఆ నిమిషానికి కాస్త రిలాక్స్ అనిపించినా కూడా తర్వాత అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఎక్కువ రోజులు ఉండే విధంగా కొన్ని కెమికల్స్, సిరప్‌లు, హానికర రసాయనాలు వాడుతుంటారు. వీటివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే వేసవిలో అధికంగా ఐస్ క్రీమ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: రాత్రిపూట తినడం మానేస్తున్నారా.. తస్మా్త్ జాగ్రత్త
ఐస్‌క్రీమ్ కాస్త స్వీట్‌గా ఉంటానికి ఇందులో కార్న్ సిరప్, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, గ్లూకోజ్ సిరప్ వంటివి వాడుతుంటారు. అయితే వీటితో పాటు కొన్ని డిటర్జెంట్లు, వాషింగ్ పౌడర్లు కూడా ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇందులోని కొవ్వులు బాడీని ఫ్యాటీ అయ్యేలా చేస్తాయి. అలాగే ఐస్ క్రీమ్ ఎక్కువ సమయం మెల్ట్ కాకుండా ఉండేందుకు గమ్స్ యాడ్ చేస్తారు. వీటివల్ల ఐస్ క్రీమ్స్ తొందరగా మెల్ట్ కావు. వీటివల్ల శరీర ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అజీర్ణం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. వీటితో పాటు డయాబెటిస్, గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ బయట లభ్యమయ్యే నాసిరకంవి అయితే అసలు తినకూడదు. వీటికి బదులు ఇంట్లోనే తయారు చేసుకుని తినడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు అయితే బయట దొరికే ఐస్‌క్రీమ్స్ అసలు ఇవ్వకండి. వీటివల్ల ఇంకా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
కొందరికి ఈ ఐస్ క్రీమ్స్ వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి. వీటిని తయారు చేయడానికి కొందరు గ్లూటెన్ వాడుతారు. దీనివల్ల చర్మంపై మచ్చలు, అలెర్జీ వంటివి వస్తున్నాయని చెబుతున్నారు. ఐస్ క్రీమ్‌లు తయారు చేసేటప్పుడు రంగు రంగులుగా కనిపించడానికి ఇందులో కెమికల్స్ వాడుతారు. వీటివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ రంగుల్లో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వేసవిలో చల్లదనం కోసం వీటిని ఎక్కువగా తీసుకోవద్దు. వీటివల్ల సమస్యలు తగ్గడం కంటే.. ఇంకా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు
-
Getting Good Job: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
-
Rich Look: ధరించే దుస్తుల్లోనే రిచ్‌గా కనిపించాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే