Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే.. మీకు లోన్ వస్తుందో తెలుసా?

Credit Score:
డబ్బులు అనేవి ప్రతీ ఒక్కరికి కావాల్సిందే. ఎంత డబ్బులు ఉన్నా కూడా అవసరానికి ఎప్పుడో ఒకసారి ఇతరుల దగ్గర తీసుకుంటాం. ఒకప్పుడు ఇతరుల దగ్గర తీసుకుంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు నుంచి తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత దీన్ని విరివిగా వాడుతున్నారు. ఒక వెయ్యి రూపాయిలు కావాలన్నా కూడా క్రెడిట్ కార్డు నుంచి లోన్ తీసుకుంటున్నారు. కొంత లిమిట్ బట్టి క్రెడిట్ కార్డులు కూడా లోన్ ఇస్తున్నాయి. అయితే బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు ఏ విషయాలు చూస్తారు? క్రెడిట్ స్కోర్ తప్పకుండా చూస్తారా? దీనికి ఎంత క్రెడిట్ స్కోర్ ఉండాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
రుణం కోసం మీరు బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నప్పుడు.. సరైన సమయానికి చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయం చెక్ చేస్తుంది. మీరు ఒకేసారి ఎన్ని బ్యాంకుల్లో రుణం పొందారు? ఎందుకు పొందారనే విషయాన్ని చెక్ చేస్తుంది. అలాగే మీరు సరైన సమయానికి రుణం ఎలా చెల్లిస్తారనే విషయాన్ని కూడా బ్యాంకు చెక్ చేస్తుంది. వీటికంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ చూస్తుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాతే మీకు లోన్ ఇస్తుంది. అయితే క్రెడిట్ స్కోర్ ఉంటేనే రుణం వస్తుంది. లేకపోతే రాదు. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 900 కంటే ఎక్కువ కనుక ఉంటే మీరు అన్ని ఫైనాన్స్ సంస్థలు ఈజీగా రుణం ఇస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోర్ 300 కంటే తక్కువగా ఉంటే మాత్రం మీకు రుణం ఇవ్వలేదు. అయితే క్రెడిట్ స్కోర్‌లను ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా చూస్తుంది.
క్రెడిట్ స్కోర్ 300 నుంచి 579 వరకు ఉంటే తక్కువగా ఉన్నట్లే. అదే 580 నుంచి 669 వరకు ఉంటే పర్లేదని, 670 నుంచి 739 వరకు ఉంటే బాగుందని అర్థం. 740 నుంచి 799 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటే చాలా బాగుందని, 800 నుంచి 850 వరకు ఉంటే అద్భుతంగా ఉందని అర్థం. అయితే ఒక బ్యాంకులో లోన్ రావాలంటే క్రెడిట్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉంటే బ్యాంకు వాళ్లు ఇస్తారు. అయితే ఇది సాధారణం. కొన్ని బ్యాంకులు 750 కంటే ఎక్కువ అడుగుతాయి. కాబట్టి మీరు 700 నుంచి 800 మధ్య క్రెడిట్ స్కోర్ ఉండేలా మెయిన్‌టైన్ చేయండి. ఈ మధ్యలో స్కో్ర్ ఉంటే మీకు తప్పకుండా బ్యాంకులు లోన్ ఇస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటేనే మంచిది. అయితే మీరు మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలంటే తీసుకున్న అప్పులు ఎప్పటికప్పుడు కట్టేయండి. అప్పుడే మీ క్రెడిట్ స్కో్ర్ బాగుంటుంది.