Children : ఈ వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచండి. లేదంటే వారి ప్రాణాలకే ప్రమాదం..

Children : చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో చాలా జాగ్రత్తలు అవసరం. పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. చాలా చిన్న పిల్లలు అయితే ఎలాంటి వస్తువులను నోట్లో పెట్టుకుంటారో కూడా తెలియదు. అందుకే కొన్ని వస్తువులను వారికి దగ్గరగా పెట్టవద్దు. కొందరు నోట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల గొంతులో ఇరుక్కుని శ్వాస కూడా ఆడదు. ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక కొన్ని సార్లు కోపంలో, బాధలో ఏది పడితే అదే చేస్తుంటారు. కోసుకోవడం, ఏవైనా రసాయనాలు కనిపిస్తే ఆవేశంలో తినేయడం వంటివి చేస్తుంటారు. మంచి చెడు తెలుసుకునే సృహలో ఉండరు కాబట్టి వారికి కొన్ని వస్తువులను దూరంగా పెట్టాలి అంటున్నారు నిపుణులు. మరి వారికి ఎలాంటి వస్తువులను దూరంలో ఉంచాలో తెలుసా?
1. ప్రమాదకర రసాయనాలు
ఇంట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు, శుభ్రపరిచే ఉత్పత్తులు, పెయింట్లు, ఇతర రసాయనాలను పిల్లలకు అందుబాటులో అసలు ఉంచకుండా జాగ్రత్త పడాలి. ఈ రసాయనాలు పిల్లలకు విషపూరితమైనవి. వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి అంటున్నారు నిపుణులు. ఇలాంటి రసాయనాలను పిల్లలకు అందకుండా దూరంగా ఉంచడమే ఉత్తమం. కొన్నిసార్లు ఈ రసాయనాలు పిల్లలకు ప్రాణాంతకం కావచ్చు. చాలా మంది వంటగదిలో లేదా హాట్ వంటి చోట రసాయనాలను ఉంచుతారు. పిల్లలు వాటిని సులభంగా చేతుల్లోకి తీసుకునే చోటనే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
2. పదునైన కత్తులు, పదునైన వస్తువులు
ఇంట్లో పిల్లలకు పదునైన కత్తులు, పదునైన వస్తువులను దూరంగా ఉంచాలి. ఈ వస్తువులు పిల్లలకు ప్రమాదకరం. వారికి హాని కలిగించవచ్చు. చాలా సార్లు పిల్లలు వీటిని తెలిసి లేదా తెలియకుండానే తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఈ పదునైన వస్తువులు వారి చేతిని తెలియకుండానే గాయ పరుస్తుంటాయి. లేదా వారు కోపంలో వెళ్లి కోసుకునే ప్రమాదం కూడా ఉంది. చాలాసార్లు పిల్లలు పదునైన కత్తితో తమ మెడను తామే కోసుకున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. లేదంటే చేతుల మీద గాయం చేసుకుంటారు. అందుకే జాగ్రత్త.
3. విద్యుత్ వస్తువులు
ఇంట్లోని విద్యుత్ పరికరాలైన ప్లగ్లు, సాకెట్లు, ఇతర ఉపకరణాలను పిల్లలకు పూర్తిగా దూరంగా ఉంచాలి. ఈ పరికరాలు పిల్లలకు ప్రమాదకరం. విద్యుత్ షాక్కు కారణం కావచ్చు. చాలాసార్లు పిల్లలు అకస్మాత్తుగా ఈ పరికరాలను ముడుతారు. ఇలా చేయడం వల్ల వారికి విద్యుత్ షాక్ కూడా తగలవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.