Weight Loss: ఈ కాఫీతో ఈజీగా వెయిట్ లాస్

Weight Loss:
మనలో చాలా మంది కాఫీ లవర్స్ ఉంటారు. ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగకపోతే అసలు రోజు గడవదు. తప్పకుండా రోజులో ఒక్కసారైనా కూడా కాఫీ తాగాలని అనుకుంటారు. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. మైండ్‌ను రిఫ్రెష్ చేయడంతో పాటు రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంచుతుంది. చిరాకు, అలసట వంటి వాటి నుంచి కూడా కాఫీ విముక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి రాకుండా చేస్తుంది. ఎక్కువగా వర్క్ ప్రెజర్ ఉన్నవారు తప్పకుండా కాఫీని తాగుతుంటారు. అయితే కాఫీలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ, క్యాప్‌చునో ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రోజుల్లో బుల్లెట్ కాఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ బుల్లెట్ కాఫీ అంటే ఏంటి? దీన్ని ఎలా తయారు చేస్తారు? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
బుల్లెట్ కాఫీని కూడా కాఫీ పౌడర్‌తోనే తయారు చేస్తారు. అయితే ఈ కాఫీ పౌడర్‌తో పాటు కాస్త చైన్ ట్రై గ్లిజరైడ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కూడా ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి చేయడం వల్ల వీటిలో హెల్తీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఒక గ్లాస్ నీటిలో కాస్త కాఫీ పౌడర్ వేసి అందులో నెయ్యి వేయాలి. ఇలా వేసిన తర్వాత అందులో కొంచెం చైన్ ట్రై గ్లిజరైడ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఇలా కలిపితే ఆ కాపీ క్రీమీగా అవుతుంది. దీన్నే బుల్లెట్ కాఫీ అని అంటుంటారు. ఈ కాఫీని ఉదయం పూట తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎలాంటి నీరసం, అలసట లేకుండా ఉంటారు. అలాగే మీరు దేనిపైనా కూడా ఫోకస్ పెట్టగలరు. ఇందులోని నెయ్యి, కొబ్బరి నూనె వంటి హెల్తీ ఫ్యాట్స్ అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. ఈ కాఫీని తాగడం వల్ల మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
ఉదయాన్నే మీరు బ్రేక్ ఫాస్ట్‌గా కూడా ఈ కాఫీని తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల మీ కడుపు నిండుగా ఉంటుంది. ఎక్కువ సమయం నిండుగా ఉండటం వల్ల మీకు తొందరగా ఆకలి వేయదు. దీంతో మీరు తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే ఇందులోని పోషకాలు బాడీలోని కొవ్వును తగ్గిస్తుంది. ఈజీగా బరువు తగ్గడానికి ఈ బుల్లెట్ కాఫీ బాగా ఉపయోగపడుతుంది. ఫిట్‌నెస్‌ను ఎక్కువగా పాటించేవారికి ఈ బుల్లెట్ కాఫీ బాగా యూజ్ అవుతుంది. బుల్లెట్ కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇందులోని గట్ హెల్త్ ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. అయితే మితంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Health Benefits: ప్రతీ రోజు ఈ జ్యూస్ తాగితే.. ఈ సమస్యల నుంచి విముక్తి
-
Weight Loss: ఒక నెలలో ఎంత బరువు తగ్గాలి? ఏది మంచిది?
-
Watermelon: రోజూ పుచ్చకాయ తింటే ఏమవుతుందంటే?
-
Weight loss : ఎంత ప్రయత్నించినా సరే బరువు తగ్గడం లేదా? జస్ట్ ఈ టీలు చాలు..
-
Curd Rice: పెరుగన్నంలో ఈ పండు కలిపి తింటే?