Beauty Tips : కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్ టోనర్ ఇలా తయారు చేసి, అప్లే చేసుకోండి.

Beauty Tips :
రైస్ వాటర్ చర్మాన్ని కాంతివంతం చేస్తుందని చెబుతున్నాయి అధ్యయనాలు. ఇక చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా. ఇక ఆసియా సంస్కృతులలో శతాబ్దాలుగా అందానికి బెస్ట్ చికిత్సగా రైస్ వాటర్ ను ఉపయోగిస్తారు. ఎందుకంట ఈ బియ్యం నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మానికి పోషణను అందిస్తాయి. మృదువుగా చేస్తాయి. ప్రకాశవంతంగా మారడానికి సహాయపడతాయి. బియ్యం నీటితో ఫేస్ టోనర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం నీరు తయారు చేసే విధానానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే? 1/2 కప్పు బియ్యం (తెలుపు లేదా గోధుమ బియ్యం), 2 కప్పుల నీరు, శుభ్రమైన సీసా లేదా కంటైనర్ తీసుకోవాలి. ముందుగా, బియ్యాన్ని బాగా కడిగి, దానిలోని మురికి, మలినాలను తొలగించాలి. ఈ కడిగిన బియ్యాన్ని ఒక పాత్రలో వేసి దానికి 2 కప్పుల నీరు కలపండి. బియ్యాన్ని నీటిలో దాదాపు 15-20 నిమిషాలు నాననివ్వండి. ఈ సమయంలో బియ్యం నుంచి పోషకాలు నీటిలోకి చేరుతాయి.
ఇప్పుడు బియ్యాన్ని నీటి నుంచి వేరు చేసి, ఆ నీటిని శుభ్రమైన సీసాలో నిల్వ చేయండి. ఈ బియ్యం నీరు మీ ముఖానికి టోనర్ గా పని చేస్తుంటుంది. బియ్యం నీళ్ళు తాజాగా ఉండాలంటే రిఫ్రిజిరేటర్‌లో ఉంచి దీనిని 1 వారం పాటు ఉపయోగించవచ్చు.
రైస్ వాటర్ ఫేస్ టోనర్ ప్రయోజనాలు
బియ్యం నీటిలో ఉండే ఇనోసిటాల్ సమ్మేళనం చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మృదువుగా చేస్తుంది. బియ్యం నీటిలో ఉండే స్టార్చ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది . ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ముడతలను తగ్గిస్తాయి. అంతేకాదు చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. తేమను ఇస్తుంది.
ఎలా ఉపయోగించాలంటే?
ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, బియ్యం నీటిలో కాటన్ ప్యాడ్ ముంచి ముఖం మీద తేలికగా అప్లై చేసి, పెట్టాలి. ఇక 10-15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. దీని తరువాత, మీ రెగ్యులర్ మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.
మీ చర్మం సున్నితంగా ఉంటే, ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. బియ్యం నీళ్లను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసి 1 వారంలోపు వాడండి. మీకు ఏదైనా చర్మ సమస్య ఉంటే, మీ వైద్యుడిని అడగకుండా మీ ముఖానికి బియ్యం నీటిని అప్లే చేయవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Skin Care Tips: వేసవిలో చర్మం దెబ్బతింటుందా? ఇలా చేయండి
-
Beauty Tips: సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ముందుగా దేన్ని అప్లై చేయాలి?
-
Beauty Tips : అకాల వృద్దాప్యంతో బాధ పడుతున్నారా? మొహం మీద ముడతలు వచ్చేశాయా? జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి..