Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
Beauty Tips: వేసవిలో చర్మం నల్లగా మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. తినే బెల్లంతో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. ఎలాంటి మచ్చలు లేకుండా మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు. అయితే బెల్లంతో ముఖానికి ఎలా ఫేస్ ప్యాక్ వేస్తే మెరిసిపోతుందో ఈ స్టోరీలో చూద్దాం.

Beauty Tips : తీపి పదార్థాలు చేయడానికి ఉపయోగించే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిది. వీటిని తీసుకోవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వేసవి కాలం వల్ల చాలా మంది ముఖం ట్యాన్‌కు గురవుతుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు అన్ని రావడంతో పాటు ముఖం నల్లగా మారుతుంది. అయితే వేసవిలో చర్మం నల్లగా మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. తినే బెల్లంతో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. ఎలాంటి మచ్చలు లేకుండా మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు. అయితే బెల్లంతో ముఖానికి ఎలా ఫేస్ ప్యాక్ వేస్తే మెరిసిపోతుందో ఈ స్టోరీలో చూద్దాం.
బెల్లంతో ముఖానికి ఫేస్ ప్యాక్ వేస్తే చర్మం నిగారిస్తుంది. ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటాయి. అయితే బెల్లంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చితేనే ముఖం మెరిసిపోతుంది. అయితే బెల్లంలో తేనె, పెరుగు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత వాటర్‌తో శుభ్రం చేసుకుంటే ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు అన్ని కూడా తొలగిపోతాయి. బెల్లం, పెరుగులోని పోషకాలు చర్మా్న్ని మెరిసేలా చేస్తాయి. చర్మంపై ఎలాంటి మచ్చలు లేకుండా మృదువుగా ఉండేలా చేస్తాయి. బెల్లంలో సెనగ పిండి కలిపి కూడా ముఖానికి స్క్రైబ్లా అప్లై చేయవచ్చు. ఇది కూడా ముఖంపై ఉండే ట్యాన్ అంతటిని పోగొడుతుంది. అయితే మీ చర్మానికి నిమ్మరసం పడితే.. ఈ మిశ్రమంలో అది కూడా వేయవచ్చు. దీనివల్ల ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తగ్గిపోతాయి. ముఖంపై ఉండే మృత కణాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఈ బెల్లంలో కలబంద కూడా వేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనివల్ల ముఖం నల్లగా మారకుండా ఉంటుంది. ఇందులోని ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ముృదువుగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
బెల్లం కేవలం చర్మానికి మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. డైలీ చిన్న ముక్క బెల్లం తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల శరీర ఆరోగ్యానికి ప్రయోజనాలే కానీ నష్టాలు లేవు. మధుమేహం రాకుండా ఉంటుంది. రక్తహీనత సమస్య క్లియర్ అవుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ నష్టాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
-
Success Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. అంబానీ కంటే ధనవంతులు మీరే