Beauty Tips : అకాల వృద్దాప్యంతో బాధ పడుతున్నారా? మొహం మీద ముడతలు వచ్చేశాయా? జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి..

Beauty Tips : వయసు పెరిగే కొద్దీ చర్మం స్థితిస్థాపకత, కొల్లాజెన్ పరిమాణం తగ్గుతుంటుంది. దీని వల్ల చర్మం వదులుగా మారుతుంది. ముడతలు కనిపించడం ప్రారంభమవుతాయి. వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. కానీ అకాల వృద్ధాప్యం కారణంగా, చర్మంపై గీతలు, ముడతలు కనిపిస్తుంటాయి. దీని వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. కాలుష్యం, సూర్యరశ్మి, ఒత్తిడి, ఆందోళన, చర్మంపై అనవసరమైన రసాయనాల వాడకం, మేకప్ ఉత్పత్తులు, చెడు ఆహారపు అలవాట్లు వంటివి అన్ని కూడా మీ చర్మాన్ని అకాల వృద్దాప్యం బారిన పడేలా చేస్తుంటాయి.
అకాల వృద్ధాప్యాన్ని ఎదుర్కోవటానికి మంచి చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించాలి. ముడతలను తొలగించే ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇవి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. చర్మాన్ని బిగుతుగా చేసే కొన్ని ఫేస్ మాస్క్‌లను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని ఉపయోగించి మీరు కూడా మీ చర్మాన్ని తాజాగా, శుభ్రంగా, బిగుతుగా, యవ్వనంగా మార్చుకోవచ్చు-
పెరుగు-పసుపు ఫేస్ ప్యాక్
పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత కడగేసుకోవాలి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మపు పిగ్మెంటేషన్‌ను తగ్గించి చర్మానికి మెరుపును తెస్తాయి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియ నుంచి రక్షిస్తాయి.
పాలు-తేనె ఫేస్ ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలలో కొన్ని చుక్కల విటమిన్ ఇ క్యాప్సూల్ కలపండి. ఒక చెంచా ఆర్గానిక్ తేనె వేసి బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అద్భుతమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. చర్మంలో తేమను లాక్ చేసే సహజ హ్యూమెక్టెంట్ కూడా ఈ ఫేస్ ప్యాక్. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. దానిలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్లు, ఎంజైమ్‌లు చర్మానికి బాగా చేరతాయి. ఇది చర్మాన్ని పోషిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.
ఓట్ మీల్ మాస్క్
అలోవెరా జెల్‌ను ఓట్ మీల్ పౌడర్‌తో కలిపి పేస్ట్‌గా తయారు చేయండి. ఈ పేస్ట్ ని ముఖం మీద అప్లై చేసి వృత్తాకారంగా మసాజ్ చేయండి. 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోండి. ఓట్ మీల్ పాత మృత చర్మాన్ని తొలగించి చర్మాన్ని తాజాగా, మృదువుగా చేస్తుంది. అయితే అలోవెరా చర్మంలో ఎక్కువ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మరింత బిగుతుగా చేస్తుంది. వృద్ధాప్యాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Beauty Tips: సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ముందుగా దేన్ని అప్లై చేయాలి?
-
Beauty Tips: ఇంతకీ రోజుకు ఎన్ని సార్లు మొహం క్లీన్ చేసుకోవాలి? ఎవరు ఎలాంటి ఫేస్ వాష్ ఎంచుకోవాలి?
-
Beauty Parlours: పార్లర్ కు వెళ్తున్నారా? ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా?