Astrology : వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది
Astrology : పూర్వం రోజుల్లో వారంలో ఉన్న ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులు ధరిస్తారు. ఇలా ధరిస్తేనే అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయని నమ్ముతారు. అయితే వారంలోని ఏడు రోజుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.

Astrology : హిందూ శాస్త్రంలో వాస్తు నియమాలు, జ్యోతిషాన్ని బాగా పాటిస్తారు. ఇప్పుడు రోజుల్లో కొందరు ఈ నియమాలను పాటించడం లేదు. కానీ పూర్వం రోజుల్లో అయితే తప్పకుండా పాటించేవారు. అప్పట్లో బయటకు వెళ్లాలన్నా కూడా ముహూర్తాలు చూసి ఏ రంగు దుస్తులు ధరించాలో కూడా ఫిక్స్ చేసుకుంటారు. పూర్వం రోజుల్లో వారంలో ఉన్న ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులు ధరిస్తారు. ఇలా ధరిస్తేనే అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయని నమ్ముతారు. అయితే వారంలోని ఏడు రోజుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
ఆదివారం
ఈ ఆదివారం రోజున సూర్యుడిని ఎక్కువగా పూజిస్తారు. సూర్య భగవానుని ఆదివారం పూజించడం వల్ల అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయని నమ్ముతారు. అయితే ఈ ఆదివారం రోజు బంగారం, పసుపు, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం కలుగుతుందట. బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం ఈ రంగు దుస్తులు ధరిస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.
సోమవారం
సోమవారం రోజు చంద్రుడిని ఎక్కువగా పూజిస్తారు. ఈ రోజున తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ధరించి బయటకు వెళ్తే అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయని అంటున్నారు. సోమవారం రోజు ఎరుపు, నలుపు, ముదురు నీలం రంగు దుస్తులు ధరించి బయటకు వెళ్తే ఎలాంటి పనులు కూడా జరగవని పండితులు చెబుతున్నారు.
మంగళవారం
ఈ రోజున ఎక్కువగా కుజుడిని పూజిస్తారు. మంగళవారం నాడు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజున తెలుపు, ఆకుపచ్చ రంగులు అసలు ధరించకూడదు.
బుధవారం
ఈ వారం బుధ గ్రహంతో లింక్ అయి ఉంటుంది. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి బయటకు వెళ్తే మాత్రం అంతా మంచి జరుగుతుంది. తలపెట్టని పనులు అన్ని కూడా జరుగుతాయి. ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే ఈ రోజున తెలుపు, పసుపు రంగు దుస్తులు ధరించి బయటకు వెళ్లకండి. వీటిని ధరించి వెళ్తే అనుకున్న పనులు అసలు సరిగ్గా కావు.
గురువారం
ఈ రోజున బృహస్పతిను ఎక్కువగా పూజిస్తారు. అయితే గురు గ్రహానికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ రోజున మీరు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల అదృష్టం కలసి వస్తుంది. అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే మీరు వేరే రంగు దుస్తులు ధరిస్తే మాత్రం తప్పుకండా సమస్యలు ఎదుర్కొంటారు.
శుక్రవారం
ఈ రోజున గులాబీ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి. వీటిని ధరించడం వల్ల మంచి జరుగుతుంది. బయటకు వెళ్లేటప్పుడు అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు శుక్రవారం రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.
శనివారం
శనివారం శనీశ్వరుడిని ఎక్కువగా పూజిస్తారు. ఈ రోజున నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులు ధరించాలని పండితులు చెబుతున్నారు. ప్రతీ వారం ఇలా ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Zodiac Signs: వీళ్ల మొదటి పెళ్లి పెటాకులు.. రెండో పెళ్లయ్యే రాశుల వారు వీరే.
-
Zodiac Sign : మీనరాశి సంచారం.. దశ తిరగబోతున్న రాశులివే
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు