Mosquitoes: కారులో దోమలు ఉన్నాయా? చాలా ఇబ్బంది పెడుతున్నాయా?
Mosquitoes కారు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కారు లోపలి భాగాన్ని శుభ్రం చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు నశిస్తాయి. కొంతమందికి కారులో ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది.

Mosquitoes: కారులో ఒకసారి దోమలు కనిపిస్తే, చాలా ఇబ్బందిగా, ఇర్రిరేటింగ్ గా అనిపిస్తుంటుంది కదా. కారులో ప్రయాణించడం కష్టం అవుతుంది. కారులో దోమలను తరిమికొట్టడానికి వేరే మార్గం లేదు. గదిలో దోమలు ఉంటే, మీరు మోర్టీన్, జెట్ కాయిల్, దోమతెరలు, ఆల్ అవుట్ లు ఉపయోగిస్తుంటారు. కానీ మీరు కారులో అలా చేయడానికి వీలు ఉండదు కదా.మరి ఇలాంటి పరిస్థితుల్లో దోమలు ఎక్కువగా రక్తాన్ని పీలుస్తుంటాయి. అందుకు కారు నుంచి దోమలను తరిమికొట్టే పద్ధతిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పద్ధతులను అవలంబించడం ద్వారా, మీరు మీ వాహనాన్ని దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు.
కారు శుభ్రం:
కారు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కారు లోపలి భాగాన్ని శుభ్రం చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు నశిస్తాయి. కొంతమందికి కారులో ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. ఇలా ఆహారం లేదా రసం మొదలైనవి పడినప్పుడు, వాటి వల్ల దోమలు చాలాసార్లు వస్తాయి. కాబట్టి, మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. చెత్త ఎక్కడ ఉంటే అక్కడ దోమలు ఉంటాయి అని మర్చిపోవద్దు. దీని పూర్తి బాధ్యత మీదే. చెత్త వేసి దోమలను కారులో పెంచుకోవడం వల్ల పూర్తి నష్టం మీరే భరించుకోవాల్సి వస్తుంది.
2. సోప్ ఫోమ్ స్ప్రే
కారులో సబ్బు నురుగు చల్లండి. లాండ్రీ సబ్బును ఒక కప్పులో కరిగించండి. దానితో నురుగు తయారు చేసి, ఈ నురుగును కారుపై స్ప్రే చేయండి. ఈ స్ప్రే వాసనకు దోమలు వెంటనే పారిపోతాయి. దోమ మీ కారు మూలకు పారిపోయే అవకావాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ దాక్కున ప్లేస్ లో కూడా దీన్ని స్పే చేయండి. దీని వల్ల మూలన ఉన్న దోమ కూడా చచ్చిపోతుంది.
3. వేప నూనె
దోమలను దూరంగా ఉంచడంలో వేప నూనె చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వాహనం లోపలి ఉపరితలాలపై వేప నూనెను పూయడం వల్ల దోమలను దూరంగా ఉంచవచ్చు. మీరు కారులో వేప నూనెను ఒక చిన్న కంటైనర్లో ఉంచాలి. మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు, ఫ్యాన్ ముందు ఈ ఆయిల్ బాటిల్ ఓపెన్ చేయండి చాలు. వేప నూనె వాసన కారు అంతటా వ్యాపిస్తుంది. దీని సహాయంతో దోమలు పారిపోతాయి.
4. దోమల నివారణ స్ప్రేలు
కారులో దోమలను దూరంగా ఉంచడంలో దోమల వికర్షక స్ప్రేలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కారు లోపల ఉపరితలాలపై దోమల వికర్షకాన్ని పిచికారీ చేయడం ద్వారా దోమలను దూరంగా ఉంచవచ్చు. అయితే, పిల్లలు కారులో ఉన్నప్పుడు దోమల వికర్షక స్ప్రేను ఉపయోగించవద్దు. ఇది పిల్లలకు చాలా హానికరం. పిల్లలు లేనప్పుడు వీటిని ఉపయోగిస్తే మీరు కారు నుంచి దోమలను దూరంగా ఉంచవచ్చు.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.