Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?

Periods Problem :
కొందరు అమ్మాయిలకు చాలా అంటే చాలా ఆలస్యంగా పీరియడ్స్ వస్తాయి. ఇంకా రుతుస్రావం కావడం లేదంటే చాలా మంది భయ పడుతుంటారు. 16 సంవత్సరాలు వచ్చిన రుతుస్రావం రాలేదు అంటే ఆందోళన చెందాల్సిన అంశమే కదా. అయితే కొన్ని కారణాల వల్ల ఇలా జరగవచ్చు. ఇక కొందరికి నెలసరి ప్రతి సారి ఆలస్యంగానే వస్తుంటుంది. అయితే ఆలస్యంగా రుతుస్రావం రావడానికి బాలికలలో అమెనోరియా ప్రమాదం కావచ్చు అంటున్నారు నిపుణులు. పునరుత్పత్తి సమస్యలను కలిగించే ఋతుస్రావం లేకపోవడం వల్ల మాత్రమే కాదు ఎముకల నష్టం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుందాం.
అమెనోరియా అంటే ఋతుస్రావం రాకపోవడం. లేదంటే కొందరికీ ఆగిపోతుంది. ప్రాథమికంగా 16 సంవత్సరాల వయస్సులోపు ఋతుస్రావం జరగదు. లేదా ద్వితీయంగా ఋతుస్రావం వచ్చి ఆగిపోతుంది. ఇక ఈ అమెనోరియాకు కారణాన్ని గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ అంతర్లీన పరిస్థితులు తీవ్రమైనవి, వైద్య సహాయం అవసరం అవుతాయి. అందుకే ముందుగానే గుర్తించాలి. అండోత్సర్గము లేకపోవడం వల్ల అమెనోరియా సంభవిస్తే, అది గర్భం దాల్చడం కష్టం అవుతుంది. కొన్ని సార్లు అసాధ్యం కూడా.
ఎముకల నష్టం (ఆస్టియోపోరోసిస్): తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎముకలు బలహీనపడటానికి దారితీస్తాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక హార్మోన్ల అసమతుల్యత గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కలిగేలా చేస్తుంది. అయితే రుతుక్రమం లేనప్పుడు, ముఖ్యంగా యుక్తవయస్సులోకి అడుగుపెట్టే యువకులకు ఈ విషయం చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. కొందరు పదే పదే అడుగుతుంటే మరింత ఒత్తిడి అనిపిస్తుంది.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి పరిస్థితులు ఋతుచక్రానికి అంతరాయం కలిగిస్తాయి అంటున్నారు నిపుణులు. కొన్ని సార్లు విపరీతమైన బరువు తగ్గడం లేదా తినే రుగ్మతలు అమెనోరియాకు కారణమవుతాయి. అధిక శారీరక శ్రమ కూడా ఋతుస్రావానికి అంతరాయం కలిగిస్తుంది. అధిక స్థాయి ఒత్తిడి హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఋతుస్రావం తప్పడానికి దారితీస్తుంది. ఇక థైరాయిడ్ సమస్యలు లేదా కొన్ని శారీరక సమస్యలు కూడా అమెనోరియాకు కారణమవుతాయి.
ఒక అమ్మాయికి 16 సంవత్సరాల వయస్సు వచ్చినా సరే రుతుక్రమం కావడం లేదంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సిందే. ఇంకా ఆలస్యం చేయవద్దు. కొన్ని సార్లు ఋతుస్రావం ఆగిపోతుంది. ఇలా జరిగినా సరే వైద్యులను సంప్రదించాలి. ఇది అంతర్లీన పరిస్థితికి సంకేతం కావచ్చు. 3-6 నెలలుగా ఋతుస్రావం సక్రమంగా లేకుంటే ఏదైనా తీవ్రమైన సమస్యను నివారించడానికి వైద్యుడిని సంప్రదించాలి. మీకు కటి నొప్పి, తలనొప్పి, వికారం లేదా దృష్టి మార్పులు వంటి ఇతర లక్షణాలు ఉంటే కూడా ఇవి అంతర్లీన వ్యాధికి సంకేతాలు కావచ్చు.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..
-
Astronaut: మహిళలకు అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే?
-
Paneer : పనీర్ అంటే ఇష్టమా? కానీ మీరు తినవద్దు..
-
Periods : పీరియడ్స్ సమయంలో కాళ్లు నొస్తున్నాయా? ఎందుకు? ఏం చేయాలి?