Jobs: నేడే చివరి తేదీ.. పరీక్ష రాయకుండానే ఉద్యోగం మీ సొంతం
Jobs ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)లో ఆఫీసర్ స్థాయిలో పోస్టులకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఐపీపీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ వంటి పోస్టులకు ఎప్పుడో దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది.

Jobs: బ్యాంకుల్లో ఉద్యోగాలు చాలా ఫ్రీగా ఉంటుందని, హ్యాపీగా చేసి వచ్చేయవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే బ్యాంకు ఉద్యోగాలు చాలా కష్టంగా ఉంటాయి. వీటికి పరీక్ష రాసి ఎంపిక కావాలంటే కాస్త సమయం పడుతుంది. ఎంతో స్మార్ట్‌గా ప్రిపేర్ అయితేనే అవుతుంది. ఈ బ్యాంకు ఉద్యోగాల కోసం చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. నిజానికి కేవలం బ్యాంకు ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ అనుకుంటారు. కొందరు ఈ చదువులు చదవలేక.. ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగం ఉంటే బాగుండు అని కోరుకుంటారు. అలాంటి వారికి ఇది గొప్ప అవకాశం. ఎందుకంటే ఎలాంటి వ్రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందవచ్చు. ప్రభుత్వ బ్యాంకులో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఈజీగా కొట్టవచ్చు. మరి అది ఏ బ్యాంక్‌లో పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)లో ఆఫీసర్ స్థాయిలో పోస్టులకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఐపీపీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ వంటి పోస్టులకు ఎప్పుడో దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. వీటికి అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 18. అంటే ఈ రోజే చివరి తేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ బ్యాంకులో ఉద్యోగం వస్తే మీ లైఫ్ కూడా సెట్ అయినట్లే. అయితే ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్‌లో మొత్తం మూడు ప్రధాన పోస్టులకు భర్తీ చేయనున్నారు. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ , ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఖాళీలు ఉన్నాయి. వీటినే భర్తీ చేయనున్నారు.
ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో పోస్టులకు అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఫైనాన్స్‌లో అయినా చదివి ఉండాలి. అయితే ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల పని అనుభవం కూడా ఉండాలి. గ్రాడ్యుయేట్లు కావడంతో పాటు అనుభవం ఉంటేనే ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెలక్ట్ చేస్తారు. ఇక ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అయితే షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు లేదా ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందాల. లేకపోతే డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేసిన అనుభవం అయినా ఉండాలి. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పోస్టులకు 38 నుంచి 55 సంవత్సరాల మధ్య అభ్యర్థుల వయస్సు ఉండాలి. అలాగే 65 సంవత్సరాలకు మించకూడదు. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌కి 3 సంవత్సరాలు పదవి కాలం. అవసరం అయితే దీన్ని పొడిగించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐపీపీబీ అధికారిక వెబ్సైట్ http://www.ippbonline.com లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.