Good news: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి
ఏపీలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకురావాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) రిక్రూట్మెంట్తో ఎలాంటి సంబంధం కలిగి ఉందనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు 2024 ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరగా పూర్తి చేయాలని చూస్తోంది.

Good news: ఏపీలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకురావాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) రిక్రూట్మెంట్తో ఎలాంటి సంబంధం కలిగి ఉందనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు 2024 ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరగా పూర్తి చేయాలని చూస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు SC లను A, B, C, D గ్రూపులుగా విభజించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఆర్డినెన్స్ కేవలం ఐదు రోజుల్లోనే పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఈ వర్గీకరణను అమలు చేయడానికి రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఓ కమిషన్‌ను కూడా నియమించింది. అయితే ఈ కమిషన్ కూడా మార్చి 10కి నివేదికను సమర్పించింది. అయితే త్వరగా ఈ వర్గీకరణను అమలు చేయడానికి చూస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఇ రిజర్వేషన్లను A (రెల్లి), B (మాదిగ), C (మాల), D (ఇతరులు) గ్రూపులుగా విభజించి, ప్రత్యేకంగా కోటాలను కేటాయించనుంది. అయితే ప్రభుత్వం ఐదు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేయవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
Also read: సీఎస్కేకి కెప్టెన్‌గా ధోని.. అసలు కారణమేంటి?
ఈ కమిషన్ మొత్తం మూడు గ్రూపులుగా విభజించాలని ప్లాన్ చేస్తోంది. గ్రూప్ 1 (రెల్లి, 2.25% జనాభాతో 1% రిజర్వేషన్), గ్రూప్ 2 (మడిగ, 41.56% జనాభాతో 6.5% రిజర్వేషన్), గ్రూప్ 3 (మాల, 53.97% జనాభాతో 7.5% రిజర్వేషన్) ఇలా విభజించాలని అనుకుంటున్నారు. అయితే ఏపీలో డీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే వీటిలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్సీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ త్వరలో వస్తుందనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ డీఎస్సీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందు వస్తే మాత్రం రిజర్వేషన్ కోటాలు, కొత్త రూల్స్‌తో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. నిజానికి ఎస్సీ వర్గీకరణ అనేది చాలా సమయం తీసుకుంటుంది.
Also read: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్గా ప్రియాంక?
డేటాను తీసుకోవడం, కోటాలను ఖరారు చేయడం వంటి వాటి అన్నింటికి కూడా కాస్త సమయం పడుతుంది. అయితే వెంటనే వీటిని అమలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు ఈ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత వర్గీకరణను అమలు చేయడం చట్టవిరుద్ధమని అంటున్నారు. ఒకవేళ డీఎస్సీ ఆపితే కనుక వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే.. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. అయితే నేడు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నేడు జరిగిన సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని కమిషన్ భావిస్తోంది.
-
Rid of Debt: అప్పుల బాధలు తీరాలంటే.. ఈ నియమాలు పాటించాల్సిందే
-
Zodiac signs: కుజుడు, శని కలయిక.. ఈ రాశుల వారికి పట్టనున్న కుభేరయోగం
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్‌పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Movies: మైత్రి మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపిన ఇళయరాజా
-
Zodiac Signs: అదృష్టమంటే వీరిదే భయ్యా.. ఈ రాశుల వారికి అసలు తిరుగే లేదు