NTPC: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.55 వేల జీతం

NTPC: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మంది కల. ఎంతో కష్టపడి మరి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. ఈ రోజుల్లో పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారు ఎక్కువ మంది ఉంటే.. పోస్టులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. అయితే ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ జరుగుతూనే ఉంటుంది. ఒక్కో పోస్టు బట్టి వారి అర్హతలు ఉంటాయి. అయితే దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇటీవల ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. న్యూ ఢిల్లీ ఎన్టీపీసీ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్‌లో మొత్తం 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనుంది. యూఆర్- 172, ఈడబ్ల్యూఎస్- 40, ఓబీసీ- 82, ఎస్సీ- 66, ఎస్టీ- 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. అయితే వీటికి చివరి తేదీ మార్చి 1. అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి చేసుకోవాలి.
ఎన్టీపీసీలో మొత్తం 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవాలంటే 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాస్ అయి ఉండాలి. ఇందులో కూడా మెకానికల్, ఎలక్ట్రికల్ రంగంలో ఉత్తీర్ణతతో పాటు కాస్త పని చేసిన అనుభవం కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.55,000 జీతం ఇస్తారు. అలాగే ఈ ఉద్యోగాలకు వయో పరిమితి కూడా 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఉండగా.. ఓబీసీ వారికి 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజును రూ.300గా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అసలు దరఖాస్తుకు ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే వీటి దరఖాస్తూ తేదీ ప్రారంభం అయ్యింది. మార్చి 1వ తేదీలోకా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.