Jobs: ఇంటర్ అర్హతతో కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.69 వేల జీతం

Jobs:
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రతీ ఒక్కరూ కూడా కలలు కంటారు. అందులోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఈ ఉద్యోగాల కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. ఏ చిన్న ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా సరే పెడుతుంటారు. అయితే ఎక్కువగా ఉద్యోగాలు గ్రాడ్యుయేషన్‌పై ఉంటాయి. కొందరు డబ్బులు లేకపోవడం లేదా వేరే ఇతర కారణాల ఇంటర్‌తో చదువు ఆపేస్తారు. అలాంటి వారికి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంటర్ చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే మాత్రం వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటికి అప్లై చేసి ఉద్యోగం సాధిస్తే.. అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. వీటికి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు ఒకసారి ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్ పూర్తి చేసిన వారికి ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్(జనరల్ డ్యూటీ), నావిక్( డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 300 పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 25 వరకు మాత్రమే గడువు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ గడువు తేదీని పెంచారు. మార్చి 3వ తేదీ వరకు ఈ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 3లోగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చ.
నావిక్(జనరల్ డ్యూటీ) 260, నావిక్( డొమెస్టిక్ బ్రాంచ్)40 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలను ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎన్ రోల్డ్ పర్సనల్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసే వారు తప్పకుండా భౌతిక శాస్త్రం, గణితంలో ఇంటర్‌లో పాస్ అయి ఉండాలి. అలాగే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు కనీసంగా ఉండాలి. గరిష్టంగా 22 సంవత్సరాలు కలిగి ఉండాలి. వీటికి ఫిజికల్ ఫిట్‌నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే నెలకు రూ.21,700 నుంచి రూ.69100 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వారికి ఫీజు లేదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 3 లోగ ఈ ఉద్యోగాలకు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోవాలి.