Jobs: డిగ్రీ పాస్ అయ్యారా ఈ నోటిఫికేషన్ మీ కోసమే.. జాబ్ కొడితే నెలకు లక్ష జీతం

Jobs: ఈ రోజుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఎక్కువ మంది ఉంటున్నారు. ఉద్యోగం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క పోస్టుకు వేల సంఖ్యలో పోటీపడుతున్నారు. డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఉద్యోగం వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కాస్త సమయం పూర్తి అయ్యిందంటే చాలు. ఉద్యోగం లభించడం కష్టమే. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కష్టపడాలి. దీనికి తోడు రిజర్వేషన్ కూడా బాగా ఉండాలి. అయితే ఈ రోజుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎక్కువగా ఆరాట పడుతున్నారు. ఏ చిన్న నోటిఫికేషన్ పడినా చాలు.. వెంటనే అప్లై చేసి ప్రిపేర్ అయిపోతుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ఉద్యోగావకాశం ఇచ్చింది. దీనిలో మొత్తం 7 పోస్టులను భర్తీ చేయనుంది. S-1 గ్రేడ్లో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు టెహ్రీ నోటిఫికేషన్ను భర్తీ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారు టెహ్రీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 14వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో జూనియర్ లెవెల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు తప్పకుండా ఉండాలి. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా 60 శాతం పాస్ మార్కులు వచ్చి ఉండాలి. అలాగే హోటల్ మెనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, బి.ఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, బి.ఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు రూ. 600 ఉంటుంది. అయితే ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు దరఖాస్తూ ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.29,200 నుంచి రూ.1,19,000 వరకు వేతనం చెల్లిస్తారు. అయితే ఈ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అయితే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి.