Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో రాబోతున్న 25 వేల ఉద్యోగాలు

Jobs: ప్రస్తుతం ఎందరో నిరుద్యోగులు ఉన్నారు. చదువుకున్న దానికి ఉద్యోగం రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న వాళ్లు లక్షల్లో ఉంటే.. ఉద్యోగాలు మాత్రం వందలు, వేలలో ఉన్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగాల కోసం చాలా ఆరాటపడుతున్నారు. అయితే నిరుద్యోగులకు ఊరట కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదరన రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) ఓ గుడ్ న్యూస్ తెలిపారు. ఇంకొన్ని రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం (SC Classification Act) వస్తుందని, దీని వల్ల దాదాపుగా 25 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఇదే కనుక జరిగితే తెలంగాణలో చాలా మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. డిగ్రీలు చదివి ఖాళీగా ఉంటున్న వారికి కాస్త ఊరట అని చెప్పవచ్చు. మినిస్టర్ దామోదరన రాజనర్సింహ ఈ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత మనందరి తలరాతలు మారాయన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణతో ఇంకా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. దీనివల్ల ఎవరి కోటాలో వారికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో అందరూ కూడా ఎక్కువగా కష్టపడుతున్నారు. యువత ఎక్కువగా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. వీటిన్నింటికి ఇది బెస్ట్ అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో ఎందరికో ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. దీంతో యువత, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో చదువుకున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదు. దీనికి తోడు రిజర్వేషన్లు కూడా ఉంటున్నాయి. ఎంత కష్టపడి చదివినా కూడా రిజర్వేషన్లు ఉండటంతో ఫలితం లేదు. ప్రభుత్వం తీసిన పోస్టుల్లో ఒక్కో కేటగిరీకి ఇన్ని పోస్టులు అని ఉంటున్నాయి. ఇలా చూసుకుంటే చాలా తక్కువ పోస్టులే వస్తున్నాయి. దీని వల్ల ఎంత కష్టపడి చదివినా కూడా ఉద్యోగాలు రావడం లేదు. దీంతో చాలా మంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రతీ ఉద్యోగానికి కూడా అప్లై చేస్తున్నారు. కానీ తక్కువ పోస్టులు కావడంతో కొందరికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. అదే ఎక్కువ పోస్టులు వస్తే మాత్రం తప్పకుండా మరికొందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎన్ని రోజుల్లో దీనికి నోటిఫికేషన్ వస్తుందో చూడాలి.