Jobs: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో.. ఎన్ఎల్సీ ఇండియాలో ఉద్యోగాలు
Jobs ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో పాస్ కావాలి. అయితే ఎస్సీ, ఎస్టీలు అయితే 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. అప్లై చేసుకోవడానికి వయస్సు 30 సంవత్సరాలు కంటే ఎక్కువగా మించకూడదు.

Jobs: తమిళనాడులోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగానికి పోస్టులను ప్రకటించింది. మొత్తం 171 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిల్లో మొత్తం జూనియర్ ఓవర్‌మ్యాన్ (ట్రెయినీ) 69, మైనింగ్ సర్దార్ 102 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు తమిళనాడులో ఎన్ఎల్సీ ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయి. అయితే వీటలో అన్‌రిజర్వుడ్‌కు 90, ఈడబ్ల్యూఎస్‌లకు 16, ఓబీసీ (ఎన్సీఎల్)లకు 26, ఎస్సీలకు 37, ఎస్టీలకు 2 కేటాయించారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా డిప్లొమో చేయాలి. వీటిలో జూనియర్ ఓవర్‌మ్యాన్ (ట్రెయినీ) పోస్టులకు మైనింగ్ డిప్లొమా/ మైనింగ్ ఇంజినీరింగ్/ తత్సమాన కోర్సులు చేస్తేనే వీటికి అప్లై చేసుకోగలరు. వీటితో పాటు ఓవర్‌మ్యాన్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కూడా తప్పకుండా ఉండాలి. ఇవి ఉంటేనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు. అయితే వీటిలో మైనింగ్ సర్దార్ పోస్టులకు మైనింగ్ ఇంజినీరింగ్ కాకుండా ఇంకా ఏదైనా సబ్జెక్టుతో డిప్లొమా/ డిగ్రీ ఉండాలి. అలాగే మైనింగ్ సర్దార్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ లేదా ఓవర్‌మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్తో మైనింగ్ డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో పాస్ కావాలి. అయితే ఎస్సీ, ఎస్టీలు అయితే 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. అప్లై చేసుకోవడానికి వయస్సు 30 సంవత్సరాలు కంటే ఎక్కువగా మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్సీఎల్)లకు మూడేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు అయితే నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. అయితే జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.595 ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ మాజీ సైనికుల ఉద్యోగులకు రూ.295 ఉంటుంది. మైనింగ్ సర్దార్ జనరల్ అభ్యర్థులకు అయితే రూ.486. ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు రూ.236 ఉంటుంది. జూనియర్ ఓవర్‌మ్యాన్ (ట్రెయినీ) పోస్టులకు నెలకు రూ.31,000 నుంచి1,00,000 వరకు ఇస్తారు. మైనింగ్ సర్దార్ పోస్టులకు నెలకు రూ.26,000 నుంచి 1,10,000 వరకు ఇస్తారు. వీటికి ధ్రువపత్రాల పరిశీలన, రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పార్ట్లు ఉంటాయి. పార్ట్-1లో జనరల్ ఆప్టిట్యూడ్‌లో మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అంశాల నుంచి పరీక్ష ఉంటుంది. పార్ట్-2లో సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 70 ఉంటాయి. అయితే రాత పరీక్షలో జనరల్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులు 40 శాతం అయినా కూడా మార్కులు సాధించాలి.